Best Nutrition foods: పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు

Best Nutrition foods:ఈ ఆధునిక యుగంలో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే తగినన్ని పౌష్టిక విలువలు కలిగిన ఆహారాన్ని ప్రతి రోజూ తీసుకుంటూ ఉండాలి. బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల రకరకాల జీర్ణ సంబంధ వ్యాధులతో పాటు దీర్ఘకాల ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మంచి పౌష్టికాహారం తింటే ఎటువంటి అనారోగ్యాలు మన దరికి చేరవు. అందుకే మనం తినే ఆహారంలో తగినన్ని పోషకాలు ఉండే విధంగా చూసుకోవాలి.

nutrition-food-telugu
Source:www.healthyfood.com

పౌష్టికాహారం కోసం బయట మార్కెట్లో వేలకు వేలకు పోసి న్యూట్రీషన్ ఫుడ్ కొనే కంటే.. సహజ సిద్ధంగా దొరికే పండ్లు, కూరగాయలు తినడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. ప్రకృతి ప్రసాదించిన పండ్లు, ఆకుకూరలు, కూరగాయలలో అన్ని రకాల విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

మంచి ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మన పెరట్లోనే దొరుకుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు

గుడ్డు

గుడ్డు ఒక సంపూర్ణ పౌష్టికాహారం. ప్రతిరోజు ఒక గుడ్డు ఉడికించి తినడం వల్ల బోలెడు పోషకాలు మీ సొంతమవుతాయి. గుడ్డులో విటమిన్లు, కార్బొహైడ్రేట్స్, మినరల్స్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా గుడ్డులో 13% మాంసకృతులు, 12% కొవ్వులు, విటమిన్-ఎ, విటమిన్ బి1,బి2,బి3,బి5,బ6,బి12 విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి.

గుమ్మడికాయ

గుమ్మడితో ఏం వండినా.. రుచితో పాటూ శరీరానికి కావలసినన్ని పోషకాలు అందుతాయి. గుమ్మడిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-ఇ, బీటా కెరొటిన్లు అధికంగా ఉంటాయి. వీటి వల్ల నేత్ర సంబంధ సమస్యలు దరిచేరవు. ఇందులో చాలా ఎక్కువగా బీటా కెరొటిన్ ఉంటుంది. బీటా కెరొటిన్ క్యాన్సర్ రిస్కును తగ్గిస్తుంది. కళ్ళుకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. గుమ్మడికాయలో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా సమృద్ధిగా లభిస్తాయి. అలాగే డయాబెటిస్ తగ్గించడానికి కూడా గుమ్మడి సహాయపడుతుంది.

టొమాటో

టమోటాల్లో లైకోపీన్ అనే ఒక శక్తివంతమైన క్యాన్సర్తో పోరాడే పదార్ధం ఉంది. విటమిన్ సి కూడా టొమాటోలో సమృద్ధిగా ఉంటుంది. … విటమిన్లు, ఖనిజాలు, మాంసకృత్తులు, పీచుపదార్థాలు (ఫైబర్) వంటి పోషకాలతో టొమేటో పుష్కలంగా ఉంటుంది మరియు తక్కువ కేలరీలను కల్గి ఉంటుంది.రోజుకు నాలుగు టొమాటోలు తీసుకుంటే క్యాన్సర్ రిస్క్ ను దూరం చేయవచ్చునని అనేక పరిశోధనల్లో తేలింది. హృదయ సంబంధమైన వ్యాధుల నివారించడంతో పాటు అత్యంత ఎక్కువ పోషక విలువలను టమోటా కలిగి ఉంటుంది. టమోటాలు తింటే కొలెస్ట్రాల్‌, అధిక రక్తపోటు, గుండె జబ్బులు తగ్గుతాయి.

అరటిపండు

అరటిలో పిండిపదార్థాలు, కార్బోహైడ్రేటులు ఎక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల పిండిపదార్థాలు, 1 గ్రాము మాంసకృత్తులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు ఉన్నాయి. అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇందులో సహజ సిద్దమైన తీపి ఉండి తక్షణం శక్తినిస్తుంది. పలచగా విరేచనాలు అవుతుంటే అరికట్టడానికి పనిచేస్తుంది.

వెల్లుల్లి

భారతీయ వంటకాలలో వెల్లుల్లికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది అంటువ్యాధులను, జలుబును దూరంగా ఉంచుతుంది.

  • వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫ్రీ ర్యాడికల్స్ మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి తోడ్పడతాయి.
  • వెల్లుల్లిలోని విటమిన్‌సి, విటమిన్‌ బి6 పైరిడాక్సిన్‌లు రోగనిరోధక శక్తి పెరగడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీని ద్వారా సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది.
  • పడిగడుపున పచ్చి వెల్లుల్లి రెబ్బలను తింటే శరీరంలో కొవ్వు స్థాయిలు తగ్గుతాయి.
  • వెల్లుల్లిలోని అల్లిసిన్‌.. రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది.
  • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో వెల్లుల్లి కీలకపాత్ర పోషిస్తుంది. ఒక గ్లాసు నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి నిత్యం తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి.

మొలకలు

  • అన్ని రకాల పప్పు ధాన్యాలు, కాయ ధాన్యాలను మొలకలుగా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
  • ఉదయం పూట టిఫిన్ కు బదులుగా మొలకలు తినవచ్చు. వీటిలో ఎక్కువగా విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. సి విటమిన్ అధికంగా ఉండే నిమ్మరసాన్ని చల్లుకుని తింటే బాగా రుచిగా ఉంటాయి. వీటిలో పోషకాలను శరీరం బాగా గ్రహిస్తుంది.

ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్షలో అత్యధికంగా ఫైబర్ ఉండడం వల్ల మలబద్దకం సమస్యకు చాలా బాగా పనిచేస్తుంది. వీటిలో విటమిన్ A ఎక్కువగా ఉండి, కళ్ళు చర్మం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి రోగాలు రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు