Pumpkin Seeds Benefits: గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ప్రయోజనాలు

Pumpkin Seeds Benefits: దిష్టి తీసివేయడానికి గుమ్మడి కాయని వాడతారు. గుమ్మడికాని అలా తిప్పి పక్కకు పాడవేస్తారు. దీంతో చెడు దృష్టి, దిష్టి పోతుందని పెద్దల నమ్మకం. గుమ్మడి కాయ విత్తనాల్లో ఎన్నో పోషకాలు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. ఆ వివరాలను ఆ ఆర్టకల్ ద్వారా మీకు అందిస్తున్నాము. గుమ్మడికాయ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Pumpkin Seeds Benefits
Source: health.clevelandclinic.org

గుమ్మడికాయ విత్తనాల ఆరోగ్య ప్రయోజనాలు

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ కె, ఒమేగా-3 , బీటా కెరోటిన్, భాస్వరం, మెగ్నీషియం, రాగి, ఇనుము, పొటాషియం లాంటి ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తినికూడా పెంచుతాయి.

హృదయ ఆరోగ్యం

గుమ్మడికాయ గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి గుండెకు చాలా మంచిది. దీంట్లో ఉంటే ఫైబర్ ఎలిమెంట్స్ జీర్ణక్రియకు దోహదపడటమే కాక, బాడీలో ఉండే అధిక కొవ్వును కూడా తగ్గిస్తుంది, అలా హృదయం ఆరోగ్యంగా ఉంటుంది.

నిద్రలేమి

గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. రోజు 100 గుమ్మడికాయ గింజలను తినడం వల్ల నిద్రబాగా పడుతుంది. దీంట్లో విటమిన్ సీ కూడా ఉండడం వల్ల భవిష్యత్తులో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది.

ఎముక ఆరోగ్యం

గుమ్మడికాయ గింజల్లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఎముకలను ఇవి బలంగా మారుస్తాయి, పగుళ్లు లేకుండా చూస్తాయి. కాల్షియం లోపం ఉన్నవారు ఈ గుమ్మడికాయ గింజలను ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.

మాత్రాశయ రాళ్లు

కొన్ని సందర్భాల్లో కొందరికి మూత్రాశంలో రాళ్లు ఏర్పడతాయి. ఆ రాళ్లను కరిగించడానికి ఈ గుమ్మడికాయ విత్తనాలు చాలా ఉపయోగపడతాయి. గుమ్మడి కాయ విత్తనాలతో చేసిన ఆహార పదార్దాలను తింటే మూత్రాశయంలో ఉన్నా రాళ్లు కరిగిపోతాయి.

జీర్ణక్రియ

గుమ్మడికాయ విత్తనంలో ఫైబర్ ఉండడంవల్ల జీర్ణక్రియకు దోహదపడుతుంది. కడుపులో ఉండే నులిపురుగుల్లాంటి వాటిని కూడా ఈ గుమ్మడికాయ చంపివేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం, గుమ్మడికాయ విత్తనాలు టాప్ వార్మ్ ఇన్ఫెక్షన్ పై 89 శాతం ప్రభావం చూపి పురుగుని చంపేస్తుందని కనుగ్గొన్నారు.

మూత్రం ఆపుకొనలేని

వయసు పై బడిన వారిలో మూత్రం ఆపుకోలేని సమస్య తలెత్తుతుంది. శరీరంలో కటి నేల కండరాలు బలహీనంగా ఉన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. గుమ్మడికాయ విత్తనాలను సేవిస్తే అవి ఈ కటి నేల కండరాలను బలోపేతం చేస్తాయి.

ఒత్తిడిని తగ్గిస్తుంది

గుమ్మడికాయ గింజల్లో విటమిన్ బి, జింక్ ఉంటాయి. ఇవి బాడీలో న్యూరోట్రాన్స్మిటర్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రసాయనం మొదడు పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.

గుమ్మడికాయ గింజలను ఎలా ఎంపిక చేసుకోవాలి?

గుమ్మడికాయ గింజలు మార్కెట్లో లభిస్తాయి. చూడ్డానికి ఆకుపచ్చ లేదా తెలుపురంగులో ఉంటాయి

గుమ్మడికాయ గింజలు కుచించుకుపోయి ఉంటే లేదా ఏదైనా దుర్వాసన వస్తే కొనకండి

గుమ్మడికాయ గింజలను ఎలా తినవచ్చు

గుమ్మడికాయ గింజలను వేయించుకొని తినవచ్చు లేదా మొలకెత్తిన తరువాత తినవచ్చు. గుమ్మడికాయ విత్తనాలను సలాడ్ పైన చల్లకొని కూడా మీరు తినవచ్చు. సూప్, పాస్తా, మ్యాగీ, లేదా ఇతరి చిన్న రెసిపీ ఏదైనా ఉంటే దాంట్లో గుమ్మడి విత్తనాలు వేసుకొని తినవచ్చు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు