#69 Samskar Colony Movie Review: బిగ్ బాస్ ఫేమ్ నోయెల్ మాజీ భార్య ఎస్తర్ నొరొన్హ ప్రధాన పాత్రలో నటించిన #69 సంస్కార్ కాలనీ ఎట్టకేలకు థియేటర్లో రిలీజ్ అయింది. మంచి రొమాంటిక్ యూత్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నప్పటికీ ఈ మూవీకి టాక్ బాగానే వస్తుంది. పి. సునిల్ కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ రివ్యూకు సంబంధించిన మిరన్ని విశేషాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
కథ
#69 ఒక కంప్లీట్ అడల్ట్ మూవీ గా మనం చెప్పుకోవచ్చు. కథ మొత్తం బోల్డ్ రొమాంటిక్ అంశాల చుట్టూ తిరుగుతుంది. అజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. ఎస్తేర్ అజయ్ కు భార్యగా నటించింది. అయితే వీరిద్దరి మధ్య ఓ టీనేజీ కుర్రాడు రావడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. టీనేజీ కుర్రాడు, ఎస్తర్ ఇద్దరూ ప్రేమలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న అజయ్ ఏం చేస్తాడు.. వారి రిలేషన్ ఎలా మలుపు తిరుగుతుందనేది ఈ మూవీ మెయిన్ కాన్సెప్ట్.
#69 సంస్కార్ కాలనీ నటీనటులు
ఎస్తర్ నొరొన్హ, రిశ్విక్ తిమ్మ రాజు, శిల్ప నాయక్ ప్రధాన పాత్రలు పోషించారు. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ కలిసి ఈ మూవీని నిర్మించారు. మధుర ఆడియో సంగీతాన్ని సమకూర్చగా ఎస్ వి శివరామ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. క్రిష్ణ మండల ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | #69 సంస్కార్ కాలనీ |
దర్శకుడు | పి. సునీల్ కుమార్ రెడ్డి |
నటీనటులు | ఎస్తర్, అజయ్, రిశ్విక్ తిమ్మ రాజు, శిల్ప నాయక్ |
నిర్మాతలు | బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ |
సంగీతం | మధుర ఆడియో |
సినిమాటోగ్రఫీ | ఎస్.వి శివరామ్ |
సినమా ఎలా ఉందంటే?
#69 సంస్కార్ కాలనీ మూవీ లో బోల్డ్ సీన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఇది ఫ్యామిలీ కలిసి చూడలేము. ఎస్తర్ చాలా బోల్డ్ గా పర్ఫామ్ చేసింది. ఎస్తర్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని బోల్డ్ సీన్స్ తగ్గించి అదే స్క్రిప్ట్ ను ప్రేక్షకులకు కన్వే చేయోచ్చు. ఈ విశయంలో రచయిత దర్శకుడు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తం ఈ మూవీ కొందరికి మాత్రమే