Salute Movie Review: మాలీవుడ్ హ్యాండ్సమ్ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన సెల్యూట్ మూవీ ఎట్టకేలకు సోని లివ్ ఓటీటీ ప్లాట్ఫారంలో ఈ రోజు మార్చ్ 18న మళయాలంతో పాటు, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. ఇటీవల దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నట్లే ఈ సినిమా కూడా మంచి రివ్యూస్ సంపాదించుకుంది. కేవలం రొమాంటిక్ చిత్రాల్లోనే కాకుండా యాక్షన్ జానర్ లో కూడా ప్రేక్షకులను అలరిస్తాడని ఈ కురూప్, సెల్యూట్ లాంటి చిత్రాలు నిరూపించాయి. సెల్యూట్ మూవీకి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ రివ్యూకు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.
కథ
సెల్యూట్ ఓ కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా చెప్పుకోవచ్చు. ఎస్ ఐ అరవింద్ కరుణాకరన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తాడు. హీరోయిన్ అమృితగా దియానా పెంటీ నటించింది. ఎస్ ఐ అరవింద్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు. ఓ పాత మర్డర్ కేసు సాల్వ్ కాకుండా అలాగే ఉండిపోతుంది. ఈ పాత కేసును రిటైరయిన్ అరవింద్ చేధించడం మెదలుపెడతాడు. కథ మొత్తం ఈ పాత కోల్డ్ కేసు చుట్టే తిరుగుతుంది.
సెల్యూట్ మూవీ నటీనటులు
దుల్కర్ సల్మాన్, దియానా పెంటీ ప్రధాన పాత్రల్లో నటించారు. మనోజ్ కె జయన్, లక్ష్మి గోపాలస్వామి, సాయి కుమార్, విజయ్ కుమార్, బిను పప్పు, సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. బాబి సంజయ్ ఈ మూవీకి కథను అందించగా, రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. యాక్టర్ దుల్కర్ సల్మానే ఈ మూవీని వే ఫేరర్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు. జేక్స్ బెజాయ్ సంగీతాన్ని సమకూర్చగా, అస్లం కె పురాయిల్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు. ఎ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలను చేపట్టారు.
సినిమా పేరు | సెల్యూట్ |
దర్శకుడు | రోషన్ ఆండ్రూస్ |
నటీనటులు | దుల్కర్ సల్మాన్, దియానా పెంటీ, మనోజ్ కె జయన్, లక్ష్మి గోపాలస్వామి, సాయికుమార్ |
నిర్మాతలు | దుల్కర్ సల్మాన్ |
సంగీతం | జేక్స్ బెజాయ్ |
సినిమాటోగ్రఫీ | అస్లం కె పురాయిల్ |
ఓటీటీ రిలీజ్ డేట్ | మార్చ్ 18, 2022 |
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ | Sony Liv |
సెల్యూట్ సినిమా ఎలా ఉందంటే?
మ్యూజిక్ ఈ మూవీకి ప్లాస్ పాయింట్ అని చెప్పవచ్చు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం చాలా బాగా వచ్చాయి. డైలాగ్స్ లో కొంత ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండేదనిపించింది. దుల్కర్ సల్మాన్ పోలీస్ పాత్రలో అద్భుతంగా నటించారు. దీయానా పెంటీ దుల్కర్ సల్మాన్ కెమిస్ట్రీ బాగుంది. మొత్తం కుటుంబం కలిసి ఒక సారి ఈ సెల్యూట్ మూవీని చూడవచ్చు.