Vikrant Rona Telugu Movie Review: విక్రాంత్ రోణ తెలుగు మూవీ రివ్యూ

Vikrant Rona Telugu Movie Review: కిచ్చా సుదీప్ నటించిన కన్నడ చిత్రం “విక్రాంత్ రోణ” ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ట్రైలర్ చూస్తే సినిమా విజువల్‌గా చాలా అద్భుతంగా ఉంది అనిపించింది మరియు KGF చిత్రంలాగే చాల గ్రాండ్ గా ఉంది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన ఒక ప్రత్యేక గీతం ఈ సినిమాకి మరింత క్రేజ్ తీసుకొచ్చింది. అన్ని పరిశ్రమల్లో అగ్ర తారలు మద్దతు ఇవ్వడంతో ఈ చిత్రాన్ని మరింత పాపులారిటీ వచ్చింది. సినిమా యొక్క లోతైన సమీక్షలోకి వెళ్లి, ఈ చిత్రం చూడదగినదో కాదో తెలుసుకుందాం.

Vikrant Rona Telugu Movie Review

కథ

ఒక పెద్ద అడవి మధ్యలో ఉన్న ఒక మారుమూల గ్రామం దాదాపు అర్ధ శతాబ్దం క్రితం అతీంద్రియ శక్తులకు నిలువు అని అక్కడి ప్రజలంతా నమ్ముతుంటారు. ఇది విక్రాంత్ రోణ అనే అసాధారణ పోలీసు అధికారి రాకతో మారిపోతుంది. విక్రాంత్ రోణ అక్కడికి వచ్చాక ఆ ఊరిలో జరిగియునా సంఘటనలే ఈ చిత్రం పూర్తి కధాంశం.

ధర్జా మూవీ నటీనటులు

సినీ తారలు కిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. జాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ భండారి దర్శకత్వం వహించారు. సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్, కెమరామెన్ విలియం డేవిడ్, ఎడిటింగ్ ఆశిక్ కుసుగొల్లికి అప్పగించారు.

సినిమా పేరువిక్రాంత్ రోణ
దర్శకుడుఅనూప్ భండారి
నటీనటులుకిచ్చా సుదీప్, నిరూప్ భండారి, నీతా అశోక్
నిర్మాతలుజాక్ మంజునాథ్, షాలిని మంజునాథ్
సంగీతంబి అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్రఫీవిలియం డేవిడ్
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

ధర్జా సినిమా ఎలా ఉందంటే?

విక్రాంత్ రోణలో ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కథ గతంలో వచ్చిన అనేక కమర్షియల్ సినిమాల తరహాలోనే ఉండడంతో పాటు లీడ్ క్యారెక్టర్‌కి కావాల్సిన అన్ని ఎలివేషన్స్ ఉన్న ఈ స్టోరీ లైన్ మాస్ ప్రేక్షకులను తప్పకుండా ఆకర్షిస్తుంది. సినిమా ఆద్యంతం ఇచ్చిన ఎలివేషన్స్‌తో కిచ్చా సుదీప్ అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ, అభిమానులు కాకుండా సినిమా సాధారణ ప్రేక్షకులకు కొంచెం బోరింగ్‌గా అనిపించవచ్చు, అయినప్పటికీ సినిమాలో అన్ని అంశాలు సరైన స్థానంలో ఉన్నాయి. “రా రా రక్కమ్మా” పాట వెండితెరపై చూడడానికి చాలా బాగుంది.

కిచ్చా సుదీప్ అసలు భయం అంటే తెలీని విక్రాంత్ రోణగా తన నటన మరియు డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుంటాడు. సంజీవ్ ఘంబీరాగా నిరూప్ భండారి తన లుక్స్ మరియు పెర్ఫార్మెన్స్ తో డీసెంట్ గా ఉన్నాడు. అపర్ణగా నీతా అశోక్ స్క్రీన్ ప్రెజెన్స్ పరిమితంగా ఉన్నప్పటికీ చాలా తక్కువ సన్నివేశాలతోనే తనదైన ముద్ర వేసుకుంది. సినిమాలో మిగతా నటీనటులందరూ అవసరమైనంత చేశారు.

సాంకేతికంగా సినిమా చాలా గ్రాండ్‌గా ఉంది. నిర్మాణ విలువలకి ఎక్కడ డోకాలేదు. దర్శకుడికి నిర్మాతలు తగినంత స్వేచ్ఛ ఇచ్చినట్లు అనిపిస్తుంది. విలియం డేవిడ్ సినిమాటోగ్రఫీ మేజర్ హైలైట్. ప్రతి ఫ్రేమ్ బాగుంది మరియు DI జోడించిన కొన్ని షాట్‌లలో హాలీవుడ్ సినిమాలా కనిపించింది. వీఎఫ్‌ఎక్స్ ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సింది. బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు, అవి కథకి సరిపోయేలాగే ఉన్నాయ్. రంగితరంగ సినిమాతో ఆకట్టుకున్న అనూప్ భండారి లార్జర్ దేన్ లైఫ్ సినిమాతో ప్రేక్షకులను తప్పకుండా అలరించాడు.

చివరగా, విక్రాంత్ రోణ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన మరో కమర్షియల్ ఎంటర్‌టైనర్, ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సామర్థ్యం కలిగి ఉంది మరియు థియేటర్‌లలో చూడదగిన చిత్రం.

సినిమా రేటింగ్: 3.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు