Akhanda OTT: శివుని భక్తుడి పాత్రలో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం చాలా మంది ఎదురుచూస్తున్న చిత్రం. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.
కథ:
స్టోరీ మొత్తం శివ భక్తుడైన అఘోరా (బాలకృష్ణ) చుట్టూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. థ్రిల్లర్‌తో ఇది యాక్షన్ చిత్రంగా భావించవచ్చు. టీజర్‌లో బాలక్రిష్ణ దూకుడుగా “కాలు దువ్వే నాంది రంగులు మార్చిన పంది, కారు కూతలు చూస్తే కాపాలం పగిలిపోద్ది” అని చెప్పాడు. ఈ డైలాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటంతో పాటు ట్రైలర్ వ్యూస్ కూడా అదిరిపోయాయి.
ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కథ, దర్శకత్వం బోయపాటి చేస్తుండగా, డైలాగ్స్ ఎం. రత్నం రాశారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చగా, సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ముందుగా మేకర్స్ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్ చేశారు, అయితే తాజా సమాచారం ఏమిటంటే, ఇది కూడా RRR కి పోటీగా ఉండటంతో దసరా సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. చిత్రానికి సంబంధించిన ఇతర సిబ్బంది వివరాలు క్రింద ఉన్నాయి.
Digital Rights: Hotstar
OTT Release Date: January 12, 2022