Radhe Shyam Review: రాధే శ్యామ్ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. తెలుగుతో పాటు తిమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ అయి మొత్తం దేశంలో ఉన్న అందరికీ మరో బాహుబలిగా నిలిచి ఎంటర్టైన్ చేసింది ఈ మూవీ. రాధేశ్యామ్ హిట్, ఫ్లాప్ అనే మాట వినపడకుండా ఎక్కడా చూసినా ఈ సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ఇక సినిమా హాల్లో అయితే అభిమానులు పండగ చేస్కుంటున్నారు. రాధే శ్యామ్ మూవీ విడుదలైన సందర్భంగా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
రాధే శ్యామ్ మూవీని భూషన్ కుమార్, టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ కలిసి 350 కోట్లతో నిర్మించారు. సెప్టెంబర్, 2018 లో ప్రారంభైన సినిమా షూటింగ్, పూర్తయి ధీయేటర్లో రిలీజ్ అవడానికి రెండేళ్లు పట్టింది. కరోనా విజృంభించకపోయివుంటే.. రాధే శ్యామ్ 2020లోనే రిలీజ్ అయి ఉండేది. రాధా కృష్ణ కుమార్ ఈ సినిమాకు కథను అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు.
రాధే శ్యామ్ కథ చాలా భిన్నమైందని.. ఈ స్టోరీతో ఇండియన్ సినిమాలో ఇప్పటివరకూ ఏ చిత్రం విడుదల కాలేదనే చెప్పాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా, రాధా కృష్ణకుమార్ అద్భుతంగా తెరకెక్కించారు. విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లో చిత్ర యూనిట్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మొత్తంగా ఒక హాలీవుడ్ హిట్ సినిమాకు తక్కువ కాకుండా రాధేశ్యామ్ ను ప్రేక్షకులకు చూపించారు.
రాధేశ్యామ్ కథ చెప్పవచ్చు కాని చూస్తేనే దాని కిక్కును ప్రేక్షకుడు పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాడు. రాధేశ్యామ్ లో జ్యోతిష్యం, రొమాన్స్, టైమ్ లైన్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఇలా అన్ని జానర్లను టచ్ చేశారు.
సినిమా ఎలాఉందంటే
రాధేశ్యామ్ సినిమాను మొత్తం కుటుంబం కలిసి చూడవచ్చు. టెక్నికల్ యాస్పెక్ట్స్ ఈ మూవీలో అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ కు ఏమాత్రం తక్కువకాకుండా దీనికి తెరకెక్కించారు. బాహుబలి తర్వాత అంత పెద్ద భారీ సినిమా ప్రభాస్ ది ఇదే కావచ్చు.
మూవీ రేటింగ్: 4/5
ఇవి కూడా చూడండి: