Uses Of Ulavas: ఉలవలు వలన కలిగే ఉపయోగాలు

Uses Of Ulavas: ఉలవచారు అంటే అందరికీ ఇష్టమే. తెలుగు ప్రజలు ఈ ఉలవ చారును చాలా ఇష్టంగా వండుకొని తింటారు. ఉలవ చారు రుచిని చూసిని వారు దాన్ని జీవితంలో మరిచిపోలేరు. రుచిలోనే కాదు ఆరోగ్య ప్రయోజానాల్లో కూడా ఉలవలు ముందున్నాయి. ఉలవల్లో ఏ పోషకాలు ఉంటాయి. అది మన బాడీలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది లాంటి విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాము.

uses-of-ulavas
Source: www.lajawabkart.com

ఉలవల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఎన్నో ఖనిజాలు

ఉలవల్లో ఖనిజాలు చాలా ఉంటాయి. వాటిలో ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్.. బ్లడ్ లోని గ్లూకోజ్ స్థాయిలను, రక్తపోటును నియంత్రిస్తుంది. మధుమేహాన్ని, గుండె సమస్యలను కూడా ఈ ఉలవలు నియంత్రిస్తాయి.

మలబద్దకం మాయం

ఫైబర్ ఉండడం చేత మలబద్దక సమస్య పోతుంది. మహిళల్లో రుతుసమస్యలకు ఇది మంచి ఉపశమనంగా పనిచేైస్తుంది. చర్మం పై పగుళ్లు, కంటిసమస్యలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. కొవ్వు పదార్ధం చాలా తక్కువగా ఉండడం వల్ల బరువు కూడా తగ్గుతారు.

అవసరమైనన్ని ప్రొటీన్లు

ఉలవల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. హార్లక్స్, కాంప్లాన్ లాంటి వాటికంటే పిల్లలకు ఉలవలు చాలా మేలు చేస్తాయి. ఉలవల్లో ఆకలిని పెంచే గుణాలు ఉంటాయి. మూత్రాశయంలో ఏవైనా రాళ్లు ఉంటే.. ఉలవలు వాటిని కరిగేలా చేస్తాయి.

లైంగిక సామర్ధ్యం

లైంగిక సామర్ధ్యం పెరగడానికి ఉలవలు బాగా ఉపయోగపడతాయి. ఉలవలు, బియ్యంతో కలిపి చేసిన జావలను పాలల్లో వేసుకొని వారం పాటు తాగితే.. లైంగిక శక్తి బాగా పెరుగుతుంది. వయాగ్రా లాంటి మాత్రలు తీసుకోవడం కంటే ఈ ఉలవలు బాగా పనిచేస్తాయి

అల్సర్లు వెంటనే తగ్గిపోతాయి

అల్సర్లు వెంటనే తగ్గాలంటే ఈ చిన్ని చిట్కాను వెంటనే ఫాలో అవండి. ఒక కప్పు ఉలవలు, చిటికెడు పొంగించిన ఇంగువ, పావు టీస్పూన్ అల్లం పేస్టు, పావు టీస్పూన్ అతి మధురం వేరు. వీటిని బాగా రుబ్బి కలిపి దానిని నీలళ్లో వేసి కొంత తేనె వేసుకొని తాగితే అల్సర్లు తగ్గిపోతాయి.

మూత్రంలో మంట తగ్గాలంటే 

కొందరికి మూత్రం పోసేటప్పుడు మంటగా ఉంటుంది. 1 కప్పు ఉలచారు, 1 కప్పు కొబ్బరి నీళ్లు. ఈ రెండింటినీ కలిపి రోజూ ఒకసారి తీసుకుంటే వారంలో మీకు మంచి ఫలితం ఉంటుంది. నెలపాటు ఇలాగే తాగితే మూత్రంలో మంట పూర్తిగా తొలగిపోతుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు