Ayurveda Health Tips: ఆయుర్వేద చిట్కాలు, చిన్న వ్యాధులకు ఆయుర్వేద చిట్కా

Ayurveda Tips: ఆయుర్వేదంతో ఎన్నో రోగాలను నయం చేయవచ్చు. ప్రపంచంలో భారత్ ఆయుర్వేదంలో కనుక్కున్నని పరిశ్కారాలు ఏ దేశమూ కనుగ్గొనలేదు. వేల సంవత్సరాలుగా భారతీయుల జీవన విధానంలో ఆయుర్వదం భాగం అయింది. ఈ రోజుల్లో చిన్న జబ్బు వచ్చినా ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఆయుర్వేదంతో అలాంటి భయాలు, వేల ఖర్చులు లేకుండా ఇంట్లోనే సమస్యను పరిష్కరించవచ్చు, రోగాన్ని నయం చేయవచ్చు. ఈ ఆర్టికల్ లో మీకోసం కొన్ని ఆయుర్వేద చిట్కాలను అందిస్తున్నాము.

ayurvedic health tips in telugu
Source: newsd.in

ఆరోగ్యానికి కొన్ని ఆయుర్వేద చిట్కాలు

జలుబు చేస్తే తగ్గడానికి

  • ఒక కప్పు వేడి పాలలో 1 చెంచా పసుపు వేసుకొని కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది
  • తులసి ఆకుల రసంలో తీనె కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • మిరియాల పొడి, పెరుగును కలిపి తీసుకోవాలి

దగ్గు తగ్గడానికి

  • నిప్పుల మీద వామును వేసి దాని పొగను పీల్చాలి
  • అరటి పండు మధ్యలో మిరియాల పొడి వేసి తినాలి
  • లవంగం పొడి కొద్ది కొద్దిగా తీసుకోవాలి

నిద్ర రావడానికి

  • వేడి చేసిన గసగసాలను బట్టలో మూటకట్టి వాసన చేస్తే నిద్ర వస్తుంది
  • ఉదయం, సాయంత్రం, ఒక్కో నిమ్మరసం తాగితే నిద్ర వస్తుంది
  • వేడి పాల్లో తేనె వేసుకొని తాగాలి

గాయం తగ్గడానికి

  • మామిడి చెట్టు బెరుడు రసాన్ని గాయం పై వేయాలి
  • లేత కొబ్బరి నీళ్లలో కొద్దిగా పసుపు, సేన్నపు తేటను కలిపి గాయం పై రాయాలి
  • గాయంపై 2,3 చుక్కల తమలపాకుల రసాన్ని వేస్తే.. గాయం పై చీము ఫార్మ్ కాకుండా ఉంటుంది

మలబద్ధకం

  • ఖర్జూరం, మేడి పండ్లు, క్యాబేజీలను తినడం వల్ల మలబధ్దకం పోతుంది
  • వెన్నె నెయ్యలను అన్నంలో కలుపుకొని తినాలి
  • శొంఠి, కరక్కాయ, పిప్పిళ్ల పొడిని సమానంగా కలిపి బెల్లంతో తీసుకోవాలి

తల నొప్పి తగ్గడానికి

  • హారతి కర్పూరం, మంచి గంధము కలిపి నుదుటి పై రాస్తే తలనొప్పి తగ్గుతుంది
  • నిమ్మకాయ రసంలో బెల్లం, ఉప్పు కలిపి నూరి పట్టువేస్తే తలనొప్పి పోతుంది

పంటి నొప్పులు తగ్గడానికి

  • పసుపు కొమ్ముని కాల్చి ఆ బూడిదతో పళ్లు తోమితే పంటి నొప్పులు తగ్గుతాయి
  • కర్పూర తైలంలో దూదిని ముంచి పంటి పుప్పి పైన పెట్టాలి
  • నిమ్మరసంలో ఇంగువను కలిపి కొద్దిగా వేడిచేసి దూదితో పంటిపైన పెడితే నొప్పి తగ్గుతుంది

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు