Diwali Festival: దివాళి పండగ అనగానే మనకు గుర్తుకు వచ్చేది దీపాలు, టపాసులు, స్వీట్లు. అన్ని పండగల్లో ఇళ్లు రంగుల మయంగా మారితే ఈ పండగ రోజు ఆకాశం రంగుల మయంగా మారుతుంది. ప్రతీ సంవత్సరం అశ్వయుజ అమావాస్య రోజున ఈ దీపావళి పండగను జరుపుకుంటారు. ఈ పండుగకు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం
దీపావళి పండగ ఆవిర్భావం
దీపావళి పండగ పుట్టుక గురించి పురాణాల్లో రకరకాలుగా వర్ణించబడి ఉంది. రామాయణంలో రావణాసురిడిని రాముడు చంపిన తరువాత అయోధ్యకు సీతతో కలిసి తిరిగి వస్తాడు. అప్పుడు అయోధ్యలో ప్రజలంగా దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. దీన్నే దీపావళిగా అప్పటి నుంచి గుర్తించి పండగను చేసుకుంటున్నారు.
ఇంకో కథను చూస్తే.. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. దేవతలను, ప్రజలను బాగా హింసించేవాడు. పురుషుడి చేతిలో చావకుండా బ్రహ్మదేవుడి నుంచి వరం పొందుతాడు. అయితే అర్వయుజ చతుర్ధశి రోజున నరకాసురుడు సత్యభామ దేవి తోటలో మరణిస్తాడు. అలా నరక చతుర్ధశి వచ్చిందని పెద్దలు చెబుతారు.
మరో కథ ప్రకారం.. పూర్వం దుర్వాసుడు అనే మహర్షి ఉండేవాడు, ఇంద్రుని ఆతిధ్యానికి మెచ్చి ఓ హారాన్ని బహూకరిస్తాడు. అయితే ఇంద్రుడు దాన్ని స్వీకరించకుండా తన ఐరావతం మెడలో వేస్తాడు. ఐరావతం ఆ హారాన్ని తొక్కి వేస్తుంది. రుషి ఈ ఘటనతో ఇంద్రున్ని శపిస్తాడు. ఇంద్రుని సంపదలన్నీ పోతాయి. దీంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు.
శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఓ దీపాన్ని వెలిగించమంటాడు. ఇంద్రుడు దీపాన్ని వెలిగించగానే లక్ష్మీదేవి ప్రత్యక్షమయి ఇంద్రుడు పోగుట్టుకున్న సంపదలన్నింటినీ తిరిగి వచ్చేలా దీవిస్తుంది. ఇలా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉందని పురాణాలు చెబుతున్నాయి.
దీపావళ రోజు చేసే పనులు
దీపావళి రోజు మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. దీంతో చుట్టూ ప్రాంతం మొత్తం కాంతివంతంగా మారుతుంది. సాయంత్రం మహాలక్ష్మికి పూజలు చేస్తారు. ఇంట్లో పిండి వంటలు స్వీట్లు చేస్తారు. ఇంటిని శుభ్రం చేసుకొని పూలతో, దీపాలతో అలంకరిస్తారు.
శ్రీ మహావిష్ణువు లక్ష్మిదేవిని భక్తులను ఎలా కరుణిస్తావు అని ప్రశ్నించినప్పుడు. నన్ను ఎవరైతై భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వారికి అష్టలక్ష్మిగా అన్ని కోరికలు నెరవేర్చుతానని చెబుతుంది. అందువల్ల దీపావళి రోజున మహాలక్షికి పూజ చేస్తారు.
ఇవి కూడా చూడండి
- Shiva Tandava Stotram In Telugu: శివతాండవ స్తోత్రం లిరిక్స్ తెలుగులో
- Siddha Mangala Stotram: సిద్ధ మంగళ స్తోత్రం
- Dwadasha Jyothirlinga Stotram: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
- Sri Durga Saptashati Slokam: శ్రీ దుర్గా సప్తశతి స్తోత్రం