Telugu Festivals: పండగ వాతావరణం అంటే సంబర వాతావరణమే. పండగ రోజు అందరూ ఉల్లాసంగా, సుఖంగా, సంతోషంగా గడుపుతుంటారు. కొన్ని పండగలు దేశంలో అందరికీ సమానంగానే ఉన్నా కొన్ని పండగలు మాత్రమే తెలుగు వారికే ప్రత్యేకం. సంక్రాంతి, మేడారం జాతర, బోనాలు లాంటివి తెలుగువారే జరుపుకుంటారు. ఇలాంటి పండగల విశేషాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
తెలుగువారి ప్రత్యేక పండగలు
బతుకమ్మ
తెలంగాణలో ఇది చాలా పెద్ద పండగ. కేవలం తెలంగాణలోనే ఈ పండగను జరుపుకుంటారు. అశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజులు ఈ పండగను పులతో అలంకరించి ఆడపడుచులు జరుపుకుంటారు. తొమ్మిది రోజులు తొమ్మిది రకాల బతుకమ్మలకు పూజ చేసి ఆ బతుకమ్మల చుట్టూ ఆడుతూ సంబరాలు చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పండగను రాష్ట్ర పండగగా ప్రకటించింది.
బోనాలు
బతుకమ్మతో పాటు బోనాల పండగను కూడా రాష్ట్ర పండుగగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బోనాల పండగ ఆవిర్భావం గురించి రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. 1869లో హైదరాబాద్ తీవ్రమైన మలేరియా వ్యాధికి గురైనప్పుడు అనేక మంది చనిపోయారు. మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తే నయం అవుతుందని అప్పటి నుంచి నమ్మకంగా వస్తుంది. అప్పటి నుంచి భక్తులు అమ్మవారిని కోరికలు కోరుతూ బోనం సమర్పిస్తున్నారు.
ఇంకో కధ ప్రకారం 1908లో హైదాబాద్ లో మూసీ నది ఉప్పొంగింది. అప్పుడు నవాబ్ అమ్మవారికి పట్టుచీర, బోనం సమర్పించడంతో పరిస్థితి మామూలు స్థితికి వచ్చింది. దీంతో ప్రతీ యేట అమ్మవారికి భక్తులు బోనం సమర్పిస్తున్నారు.
ఉగాది
ఉగాదిని తెలుగు వారి న్యూ ఇయర్ గా కూడా గుర్తిస్తారు. ఉగాది, యుగాది అనే పదం నుంచి పుట్టిందని అంటార. అంటే ఉగాది రోజునే యుగం ప్రారంభం అయిందని భావిస్తారు. ఉగాది రోజున షడ్రుచులతో అంటే తీపి, కారం, చేదు, వగరు, ఉప్పు, పులుపు రుచులతో పచ్చడిని తయారు చేస్తారు. ఈ పచ్చడిలో అన్ని రకాల రుచులు ఉంటాయి. ఈ పచ్చడి తెలుగువారికి చాలా ప్రత్యేకం
మేడారం సమ్మక్క సారక్క జాతర
దేశంలోనే అతి పెద్ద గిరిజన పండగగా దీన్ని చెబుతుారు. రెండు సంవత్సరాలకు ఓసారి మాఘ మాసంలో శుధ్ద పౌర్ణమి నాడు ఈ జాతను ఘనంగా జరుపుతారు. మేడారం జాతరకు పెద్ద చరిత్ర వుంది. 13వ శతాబ్దంలో తెలంగాణ ప్రాంతాన్ని కాకతీయులు పాలించేవారు. ఆ రాజ్యంలో అడవిలో ఓ చిన్న పాపకు సింహాలు కాపలా కాయడం చూస్తారు. ఆ పాప పెరిగి పద్దదయి పగిడిద్ద రాజును వివాహం చేసుకుంటుంది.
కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు కప్పం కట్టమని పడిగిద్ద రాజును అడుగుతాడు. ఈ విషయమై గిరిజనుల రాజుకు, కాకతీయ రాజుకు ఘోర యుద్ధం జరుగుతంది. ఈ యుద్ధంలో కాకతీయులు పరాజయం చెందుతారు. అయితే సమ్మక్క, సారక్కలను వెనక నుండి కాకతీయులు పొడుస్తారు. సమ్మక్క బాణాలతోనే నడుచుకుంటే చిలక గుట్ట ప్రాంతానికి చేరుకుంటుంది. ప్రజలు ఆమె కోసం తరువాత వెతికితే కనిపించదు, కానీ కుంకుమ భరని కనిపిస్తుంది. అప్పటి నుంచి సమ్మక్కను, సారక్కను ప్రజలు దేవతలుగా కొలుస్తారు.
ఇవి కూడా చూడండి
- Diwali Festival: దివాళి పండగ ప్రత్యేకత
- Dasara Festival: దసర పండగ ప్రాముఖ్యత
- Ugadi Festival: ఉగాది పండగ ప్రాముఖ్యం
- Lingashtakam In Telugu: తెలుగులో లింగాష్టక స్తోత్రము