Dasara Festival: దసర పండగ ప్రాముఖ్యత

Dasara Festival: దరసా పండగ అనగానే మనకు గుర్తికు వచ్చేది అమ్మవారి పూజలు, కొత్త బట్టలు, ఢాంఢియా, సేలవులు. దసరా పండగని హిందువులు అన్ని పండగల్లో కంటే పెద్దగా జరుపుకుంటారు. దాసరా పండగను అశ్వయుజ మాసం శుక్లపక్షం పాడ్యమి నుంచి 9 రోజులు వరసగా జరుపుకుంటారు. శరత్ రుతువులో ఈ నవరాత్రులు జరుపుకుంటారు కాబట్టి దీన్ని శరన్నవరాత్రులు అని అంటారు.

dasara in telugu

దరసా పండగ ఆవిర్బావం

మహిశాసుర వధ

పూర్వం మహిశాసురుడు అనే రాక్షసుడు ఉండే వాడు. మహిష అంటే దున్నపోతు అని అర్ధం. రాక్షసుడు దున్నపోతు అవతారంలో ఉండడం చేత అతన్ని మహిశాసురుడిగా పిలిచేవారు. అతను బ్రహ్మదేవున్ని ప్రసన్నం చేసుకొని ఏ పురుషుని చేతిలో కూడా మరణించ వద్దనే వరాన్ని కోరతాడు. అయితే మహిశాసురుడు ప్రజల్ని, దేవతలను హింసించడం ప్రారంభిస్తాడు. దేవతలందరూ కలిసి ఓ శక్తిని సృష్టిస్తారు. ఆ శక్తే దుర్గామాత.

దుర్గామాత తొమ్మిది రోజులు మహిశాసురునితో యుద్ధం చేసి చివరికి 10వ రోజు వధిస్తుంది. అదే రోజును మనము విజయ దశమిగా చెప్పుకుంటాము.

రామాయణ దసరా

రాముడు రావణాసురుడిని దసరా రోజున వధించాడని కూడా పురాణాలు చెబెతున్నాయి. అనేక పెద్ద పండగలు రామాయణంతో ముడిపడివున్నాయి. రాముడు అయోధ్యకు సీతతో తిరిగి వచ్చిన రోజున దీపావళి జరుపుకుంటారని అంటారు.

మహాభారత దసరా

పాండవులు కౌరవులతో యుద్ధం చేసిన తరువాత, అంటే యుద్దం ముగించుకున్న అనంతరం జమ్మి చెట్టు పై నుంచి ఆయుధాలను తీసుకున్న రోజునే దసరా అని కూడా పురాణాలు చెబుతున్నాయి.

9 రోజుల పండగ

అమ్మవారిని 9 రోజులు 9 అవతారాలతో పూజిస్తారు. చాలా నిష్టగా భక్తితో భక్తులు ఈ పూజను నిర్వహిస్తారు. పూజలో ఏ అపవిత్రం జరగకుండా భక్తులు చాలా జాగ్రత్తలను పాటిస్తారు.

దసరా పండగలో 9 రోజులు 9 అవతారాలు

అమ్మవారు మొత్తం 9 అవతారాల్లో భక్తులకు దర్శనం ఇస్తుంది. ఈ 9 అవతారాల గురించి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది.

  • బాలాత్రిపుర సుందరి – పొంగలి
  • గాయత్రీ దేవి – పులిహోర
  • న్నపూర్ణా దేవి – కొబ్బెరన్నం
  • కాత్యాయనీ దేవి – అల్లం గారెలు
  • లలితా దేవి – దద్దోజనం
  • శ్రీలక్ష్మీ దేవి – రవ్వ కేసరి
  • మహా సరస్వతీ దేవి – కదంబం
  • మహిషాసురమర్దిని – బెల్లం అన్నం
  • రాజరాజేశ్వరీ దేవి – పరమాన్నం

9 రోజుల పండగ పూర్తయిన తరువాత భక్తులు 10వ రోజును విజయ దశమి రోజున ఉదయాన్నే లేని తల స్నానం చేస్తారు. కొత్త బట్టలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తారు. ఆరు బయట టపాకాయలను పేలుస్తారు. జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకొని దసరా శుభాకాంక్షలు చెప్పుకుంటారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు