Podupu Kathalu: పొడుపు కథలు తెలుగులో

Podupu Kathalu: మనము చిన్నప్పుడు ఎన్నో పొడుపు కథలను విని ఉంటాము. పొడుపు కథలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అవి ఆలోచనని పెంచుతాయి అలాగే మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా అందిస్తాయి. అంత్యాక్షరి లాగా ఈ పొడుపు కథలను కూడా ఒక గేమ్ లా ఆడేవారము. ప్రస్తుతం వీడియో గేమ్స్ రావడం వల్ల ఈ పొడుపు కథలను చాలా తక్కువ మంది పిల్లలు ఆడుకుంటున్నారు. కేవలం ఊళ్లకే ఇప్పుడు ఈ పొడుపు కథలు పరిమితమయ్యాయి. ఈ ఆర్టికల్ లో మీకు కొన్ని పొడుపు కథలను అందిస్తున్నాము. మీకు నచ్చిన వారికి షేర్ చేసి ఎంజాయ్ చేయండి.

podupu-kathalu-in-telugu
Source: i.ytimg.com

కింద కొన్ని పొడుపు కథలను ఇచ్చాము వాటి జవాబులను కింద వేరుగా ఇవ్వడం జరిగింది. మీకు ఈ పొడుపు కథల ప్రశ్నలకు సమాధానం దొరక్కపోతే, లేదా మీ సమాధానం సరైందా కాదా అన్నది కింద చెక్ చేసి తెలుసుకోండి.

పొడుపు కథల ప్రశ్నలు

  1. చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది?
  2. జాన కాని జాన, ఏమి జాన?
  3. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది
  4. లాగి విడిస్తేనే బ్రతుకు?
  5. పువ్వులో అందరికీ పనికి వచ్చే పువ్వు?
  6. పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే?
  7. పొద్దుటూరి చెట్లలో సొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టేవారు లేరు?
  8. మూత తెరిస్తే, ముత్తయాల పేరు?
  9. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు
  10. మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ?
  11. ముళ్ల కంచెలో మిఠాయి పొట్లం?
  12. రసం కాని రసం ఏమి రసం?
  13. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన
  14. మోదం కాని మోదం?
  15. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది?
  16. కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి?
  17. రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు?
  18. రాజు నల్లన ప్రధాన పచ్చన, పాలు పుల్లన?
  19. రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది?
  20. రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్లు?
  21. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది
  22. కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు?
  23. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు?
  24. సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది?

పై పొడుపు కథల ప్రశ్నలకు జవాబులు

  1. ఉల్లిపాయ
  2. ఖజాన
  3. వేరుశెనగ కాయ
  4. ఊపిరి
  5. పత్తి పువ్వు
  6. దీపం
  7. సూర్యుడు
  8. దంతాలు
  9. తేనె పట్టు
  10. లవంగ మొగ్గ
  11. తేనె పట్టు
  12. నీరసం
  13. పాలు, పెరుగు, నెయ్యి
  14. ఆమోదం
  15. ఉత్తరం
  16. సీతాకోక చిలుక
  17. మంగలి
  18. తాటి చెట్టు
  19. ఎండ, వాన, చలి
  20. తేలు
  21. దీపం వత్తి
  22. మురళి
  23. ఉల్లి
  24. శంఖం

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు