Garikapati Narasimha Rao Biography: గరికపాటి నరసింహారావు బయోగ్రఫీ, పండితులు, జ్ఞాన బోధకుడు

Garikapati Narasimha Rao Biography: తెలుగు రాష్ట్రాల్లో గరికపాటి నరసింహారావు గురించి తెలియని వారెవరుంటారు. ప్రతీ రోజూ యూట్యూబుల్లోనే లేదా వాట్సాప్ స్టేటస్సులోను అందరికీ ఏదోబోధ చేస్తూ కనిపిస్తూనే ఉండారు. గరికపాటి ఉపన్యాసాలు వినడానికి అనేక మంది తహతహలాడుతుంటారు. గరికపాటి గురించి మరిన్ని విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం.

sri-garikapati-narasimha-rao

శ్రీ గరికిపాటి నరసింహారాబు జననం, బాల్యం, విద్య

శ్రీ గరికపాటి గారూ గోదావరి జిల్లా, పెంటపాడు మండలం బోడపాడు అగ్రహారంలో వెంకట సూర్యనారాయణ, వెంకట రమణమ్మ దంపతులకు 1958 సెప్టెంబర్ 14వ తేదీన విలంబి నామ సంవత్సరంలో జన్మించారు. గరికిపాటు ఎం. ఏ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేశారు. సుమారు 30 ఏల్లపాటు ఉపాద్యాయుడిగా వర్క్ చేశారు.

గరికపాటి తన ఇద్దరు కుమారులకు ప్రముఖ రచయితలైన శ్రీశ్రీ, గురజాడ పేర్లను పెట్టారు. గరికిపాటి తెలుగు రాష్ట్రాల్లో పెద్ద అవధాని. విదేశాల్లో, ఇక్కడ కూడా ఆయన ఎన్నో అవధానాలను పూర్తి చేశారు.

గరికపాటి గొప్ప ఉపన్యాసకుడు. మొదట ఆయన 11 అంశాలు, జీవనం, సాహిత్యం, సంసృతి వంటి ఇతర అంశాలపై ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు సీడీలుగా విడుదలయ్యయి. ఇవే కాకుండా పద్య కావ్యాలు, పాటలు, ఇలా ఎన్నో వాటిని ఆయన పుస్తకాలుగా ప్రచురరించి చాలా ప్రఖ్యాతి గాంచారు.

ఉపాధ్యాయుడిగా ఆయన కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అవార్డులను, సత్కారాలను అందుకున్నారు. వాటిని ఇప్పుడు చూద్దాం.

అవార్డులు సంవత్సరాల వారీగా:

రామినేని ఫౌండేషన్ వారి పురస్కారం, 2018
పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం, 2018
గురజాడ విశిష్ట పురస్కారం, 2016
లోక్ నాయక్ ఫౌండేషన్ వారిచే పురస్కారం, 2015
శ్రీ శ్రీ సాహిత్య పురస్కారం 2013 (విశాఖ ఉక్కు కర్మాగారం)
తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012
ఆదిభట్ల నారాయణదాసు అవార్డు హెమ్.టి.వి వారిచే ప్రదానం, 2012
సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ పురస్కారం, 2012
కొప్పరపు కవుల పురస్కారం, విశాఖపట్నం, 2011
అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం, 2008
‘సహృదయ’ సాహిత్య పురస్కారం (వరంగల్లు), 2005
నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ), 2004
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం, 2003
‘సాధన సాహితీ స్రవంతి’ పురస్కారం, ( హైదరాబాదు), 2002
తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం 2000
ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ, 1989
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ప్రావీణ్యానికి గాను కందుకూరి వీరేశలింగం మరియు
జయంతి రామయ్యపంతులు అవార్డు, 1978

 

గరికపాటి తన కెరీర్ లో ఎన్నో బిరుదులను, గౌరవాలను పొందారు. డైరక్టర్ పూరీ జగన్నాధ్ సైతం తనకు గరికిపాటి గారంటే చాలా ఇష్టం అని ఓ సందర్భంలో చెప్పారు.

  • ప్రవచన కిరీటి
  • అమెరికా అవధాన భారతి
  • ధారణా బ్రహ్మ రాక్షసుడు (1997)
  • సహస్రభారతి (1996)
  • అవధాన శారద (1995)
  • శతావధాన గీష్పతి (1994)
  • శతావధాన కళా ప్రపూర్ణ

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు