1000 Pillar Ramappa Temple Warangal: వరంగల్ రామప్ప వేయి స్థంభాల గుడి, యునెస్కో గుర్తింపు

1000 Pillar Ramappa Temple Warangal: వరంగల్ లోని రామప్ప టెంపుల్ ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రఖ్యాతి గాంచింది. వెయ్యి స్థంబాల గుడిగా దీనికి పేరు ఉంది. కాకతీయులు సుమారు 800 ఏళ్ల క్రితం ఈ ఆళయాన్ని నిర్మించారు. కొంత భాగం దెబ్బతినడం తప్పితే ఈ ఆలయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ రామప్ప టెంపుల్ గురించి మరిన్న విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం.

1000-pillar-temple-warangal
source: thenewsminute.com

రామప్ప దేవాళయం హైదరాబాద్ నుంచి 157 కిలోమీటర్ల దూరంలో ఉంది. వరంగల్ లోని ములుగు జిల్లాలో ఈ రామప్ప దేవాళయం ఉంది. దీనికి రామలింగేశ్వర స్వామి దేవాలయం అని పేరు కూడా ఉంది. దేవాళయం పక్కనే రామప్ప సరస్సు ఉంది. కాకతీయులు 13, 14 శతాబ్దం మధ్యలో ఈ రామప్ప దేవాళయాన్ని నిర్మించారు. గణపతి దేవుడు ఆలయంపై వేయించిన శిలాషాసనం బట్టి ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించినట్లు అభిప్రాయానికి వచ్చారు.

ఈ ఆలయం నిర్మాణానికి 40 ఏళ్లు పట్టిందట. ఈ ఆలయం గోపురం కోసం ఉపయోగించిన ఇటుకలు నీళ్లో వేస్తే తేలుతాయట. ఈ దేవాలయంలో కొలువై ఉండేది మహాశివుడు. పురణాల్లో ఎన్నో కథలను వర్ణించే అద్భతమైన శిల్పాలు, ఈ ఆళయం గోడలపై చెక్కి ఉన్నారు.

గర్భ గుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఉన్న స్థంబాల మీద అత్యం రమణీయమైన శిల్పాలు చెక్కియున్నారు. 17వ శతాబ్దంలో వచ్చిన భూకంపం వల్ల ఈ ఆలయం కొద్దిగా దెబ్బ తిన్నది.

ఈ ఆళయంలోపల ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. శిల్పాన్ని వేళ్లతో మీటితే సంగీతం పలుకుతుంది. ప్రధాన ఆలయం నక్షత్రాకారం గడ్డెపై ఉంది. రామప్ప ఆలయం చుట్టూ ఉన్న 526 ఏనుగు విగ్రహాలు మనల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తాయి.

రామప్ప చెరువును కాకతీయుల కాలంలో కాకతీయ రాజు కిష్టన్న నాయుడు నిర్మించాడు. ఈ సమాచారం అంతా 1950లో ప్రముఖ రచయిత సురవరం ప్రతాప్ రెడ్డి రచించి పబ్లిష్ అయిన “ఆంధ్రుల సాంఘీక చరిత్ర” పుస్తకంలో ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా రామప్ప ఆలయానికి గుర్తింపు వచ్చింది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు