Konark Sun Temple In Telugu: కోణార్క్ సూర్య దేవాళయం చరిత్ర, విశేషాలు తెలుగులో

Konark Sun Temple In Telugu: దేశంలో ఈ కోణార్క్ సూర్య దేవాళయానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఒడిస్సాలోని ప్రతిష్టాత్మకమైన పూరీ క్షేత్రానికి ఈ ఆలయం 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలో ఎక్కడాలేని సర్య దేవాలయం ఇక్కడ ఉంది. 13వ శతాబ్దంలో తూర్పు గంగా వంశానికి చెందిన రాజు ఈ ఆళయాన్ని నల్లని గ్రేనైట్ బండలతో నిర్మిచాడు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్న విషయాలను ఇప్పుడు తెలుసకుందాం.

Konark Sun Temple In Telugu

 

 

కాణార్క్ సూర్యదేవాలయం విశిష్టత

సూర్యుని రథం ఆకారంలో ఈ ఆలయాన్ని నరసింహదేవుడు అనే రాజు 1236 నుంచి 1264 మధ్య దీన్ని నిర్మిచాడు. ఈ ఆలయం రూపం కూడా అద్భతంగా ఉంటుంది. మొత్తం ఆలయాన్ని ఏడు బలమైన అశ్వాలు, 12 జతల చక్రాలతో లాగుతున్నట్లుగా ఉంటుంది. సంవత్సరానికి 12 నెలలున్నట్లు, 12 రాశులున్నట్లు ఈ ఆలయానికి కూడా 12 చక్రాలు ఉంటాయి.

ఈ కోణార్క్ ఆలయంలో ఎన్నో విచిత్రాలు, అంతుచిక్కని మిస్టరీలు దాగిఉన్నయి. ఇప్పటికీ కొందరు శాస్త్రవేత్తలకు ఆ ఆలయ విషిష్టతను పూర్తిగా అంచనా వేయలేకపోతున్నారు.

కోణార్క్ ఆలయం 12 జతల చక్రాలతో రథాకారంలో ఉంటుంది

  • ఆలయంపై పద్మము, కళషం అద్భుతంగా చెక్కబడి ఉంటుంది.
  • ఖజురాహో ఆలయంపై ఉన్నట్లుగా ఇక్కడ కూడా శృంగారానికి సంబంధించిన శిల్పాలు ఉంటాయి.
  • ఈ ఆలయం ఉన్న సముద్రం ఇసుక బంగారు రంగులో ఉంటుంది.
  • ఆలయం చక్రాలపై పడే సూర్యకిరణాల ఆధారంగా టైమ్ ఎంత అవుతుందో అక్కడి స్థానికులు చెప్పగలరు.

కోణార్క్ లో సూర్యుని దేవాలయంతో పాటు అఖిలాండేశ్వరి దేవాలయం, అమరేవ్వర ఆలయం, దుర్గ, గంగేశ్వరీ, కెండూలీ, లక్ష్మీ నారాయణ, మంగళ, నీల మాధవ ఆలయాలు కూడా ఉన్నాయి.

ఈ ఆలయానికి సంబంధించి రకరకాల కథలు చర్చల్లో ఉన్నాయి. సాక్షాత్తు సూర్యుడే ఇక్కడ తపస్సు చేశాడని పద్మ పురాణంలో ఉంది. పూరీ ఆలయంలోనే భక్త కబీర్ దాస్ సమాధి కూడా ఉందని చరిత్ర చెబుతుంది. యునెస్కో వారు కూడా ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.

కోణార్క్ టెంపుల్ ఎలా ఉంటుంది అంటే?

ఈ దేవాళయం ఎంట్రెన్స్ లో 24 చక్రాలు ఉంటాయి. అవన్నీ ఎంతో అద్భతంగా శిల్పకళాకాలరు చెక్కరు. అయితే వాటిలో కొన్ని ప్రకృతి వైపరీత్యాలవల్ల దెబ్బతిన్నాయి. ఒరిస్సా దేవాలయాలు మొత్తం నాలుగు రకాల్లో ఉంటాయి. రేఖ, భద్ర, ఖఖారా, గౌరీయ. ఈ ఆలయం రేఖా ఆలయరకాన్ని పోలి ఉంటుంది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు