Karthika Deepam Heroine Biography: కార్తిక దీపం సీరియల్ హీరోయిన్ ప్రేమి విశ్వనాథ్ బయోగ్రఫీ

Premi Vishwanath Biography: కార్తిక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులందరికీ ఆమె వంటలక్కగా పరిచయం అయింది. వంటలక్క అసలు పేరు ప్రేమి విశ్వనాధ్. ప్రేమి విశ్వనాధ్ నటి మాత్రమే కాదు, ఆమె ఒక మోడల్, యాంకర్ కూడా. కేరళలోని కొచ్చి, ఎర్నాకులంటే ప్రాంతంలో ఎడపల్లిలో 1991 డిసెంబర్ 2న విశ్వనాధ్, కాంచన విశ్వనాధ్ దంపతులకు ఆమె జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు యాక్టింగ్ పై మక్కువ. సీరియల్ లో యాక్ట్ చేయకముందు ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా ఆమె పనిచేసింది.

karthika deepam serial heroine biography

ప్రేమి విశ్వనాధ్ తమ్ముడు శివ ప్రసాద్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ప్రోమివిశ్వనాధ్ కు ప్రముఖ జ్యోతిష్యుడు టీఎస్ వినీత్ భట్ తో వివాహం అయింది. ఆమె భర్త వినీత్ రష్యన్ పార్లమెంట్ మాస్కోలో 2017లో బెస్ట్ ఆస్ట్రాలజర్ గా అవార్డు తీసుకున్నారు.

2014 నుంచి ఇండస్ట్రీలో

2014లో మొదటి సారి ప్రెమి విశ్వనాధ్ మాళయాళం సీరియల్ కారుతముతు లో కార్తిక బాలచంద్రన్ పాత్రని పోషించింది. ఆ తరువాత “బడై బంగ్లో, వెల్లినాక్షత్రంగల్, పులర్కలం, లాఫింగ్ విల్లా లాంటి టీవీ షోలు కూడా చేసింది.

మళయాలంలో ఎన్నో సీరియల్స్, షోలో యాక్ట్ చేసినప్పటికీ 2017లో తెలుగు సీరియల్ కార్తిక దీపంతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఇదే తెలుగులో ఆమె మొదటి సీరియల్. ఇందులో దీప పాత్రలో వంటలక్కగా అందరి మన్నలను పొందింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టీవీలో వంటలక్క ఎవరో తెలియని వారుండరు. గోరింటాకు, చెల్లెలి కాపురం లాంటి టీవీషోస్ లో కూడా ఆమె పాల్గొన్నది.

ఎన్నో అవార్డులు

2014లో ప్రేమి విశ్వనాధ్ కు బెస్ట్ ఫీమేల్ డెబెటెంట్ గా కారుతముత్తు సీరియల్ కు గాను ఏషియన్ టెలివిజన్ అవార్డు అందుకుంది. అదే సిరియల్ కు గాను జేసీ ఫౌండేషన్ నుంచి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డు అందుకుంది. కార్తిక దీపం సీరియల్ తో పాపులర్ కావడంతో 2018 లో బెస్ట్ యాక్ట్రస్ గా స్టార్ మా పరివార్ అవార్డు అందుకుంది.

వంటలక్కకు పెరుగన్నం, చీరకట్టు, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తనకు స్వంతంగా మెర్సిడెస్ కారు కూడా ఉంది. సీరియల్స్ పై తనకు ఉన్న ప్యాషన్ కారణంగానే వంటలక్క టాప్ సిరియల్ యాక్ట్రస్ గా ఎదిగింది. తెలుగు ప్రేక్షకులు ఆమెను సొంత ఇంటి మనిషిగా భావిస్తారు. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ గురంచిన మరిన్న విషయాలను మీకు త్వరలోనే అందిస్తాము.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు