Chukkala Chunni Lyrics: ఎస్ ఆర్ కళ్యాణమండపం మూవీలోని చుక్కల చున్ని పాట లిరిక్స్

Chukkala Chunni Lyrics: ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా బాక్సాఫీస్ లో మంచి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. నటులు కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ కు ఈ సినిమా తమ కెరీర్ లో ఓ పెద్ద హిట్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలోని చుక్కల చున్ని పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. అనేక మంది ఈ లిరిక్స్ కోసం సర్చ్ చేస్తున్నారు. భాస్కర్ భట్ల దీనికి లిరిక్స్ రాయగా, అనురాక్ కుల్ కర్ణీ పాడారు ఇక చైతన్య భరద్వాజ్ దీనికి మ్యూజిక్ కంపోజ్ చేశారు.

chukkala-chunni-lyrics-in-telugu చుక్కల చున్ని లిరిక్స్ తెలుగులో

తొ తో రుత్తో త్తోత్తో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో రుత్తో త్తోత్తో
తొ తో తొవ్ తో…
హే చుక్కల చున్నీకే… నా గుండెను కట్టావే
ఆ నీలాకాశంలో…అరె గిర్రా గిర్రా తిప్పేసావే
మువ్వల పట్టీకే… నా ప్రాణం చుట్టావే
నువ్వెళ్ళే దారంతా…  అరె..! గళ్ళు గళ్ళు మోగించావే
వెచ్చా వెచ్చా ఊపిరితోటి… ఉక్కిరి బిక్కిరి చేశావే
ఉండిపో ఉండిపో… ఉండిపో నాతోనే
తరచక్క తధూం ఆ ఆ తరచక్క తధూం ఆ ఆ
తరచక్క తధూం ఆ ఆ క్క క్క ఆ ధూం
హోయ్యరే హోయ్యరే … హొయ్యా హొయ్యా..
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా
హోయ్యరే హోయ్యరే … హొయ్యా హొయ్యా..
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా..!
ఆయ్… కొత్త కొత్త చిత్రాలన్నీ… ఇప్పుడే చూస్తున్నాను
గుట్టుగా దాచుకోలేను… డప్పే కొట్టి చెప్పాలేను
పట్టలేని ఆనందాన్ని ఒక్కడినే మొయ్యలేను
కొద్దిగా సాయం వస్తే… పంచుకుందాం నువ్వు నేను
కాసేపు నువ్వు కన్నార్పకు… నిన్నులో నన్ను చూస్తూనే ఉంటా
కాసేపు నువ్వు మాటాడకు… కౌగిళ్ళ కావ్యం రాసుకుంటా
ఓ ఎడారిలా ఉండే నాలో… సింధూ నదై పొంగావే ఉండిపో ఉండిపో… ఉండిపో ఎప్పుడూ నాతోనే హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా..
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా
హోయ్యరే హోయ్యరే … హొయ్యా హొయ్యా..
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా
బాధనే భరించడం… అందులోంచి బయటికి రాడం
చాలా చాలా కష్టం అని… ఏంటో అంతా అంటుంటారు
వాళ్లకి తెలుసో లేదో… హాయిని భరించడం
అంతకన్న కష్టం కదా… అందుకు నేనే సాక్ష్యం కదా
ఇంతలా నేను నవ్వింది లేదు… ఇంతలా నన్ను పారేసుకోలేదు
ఇంతలా నీ జుంకాలాగా… మనసేనాడు ఊగలేదు
హే దాయి దాయి అంటూ ఉంటే… చందమామై వచ్చావే
ఉండిపో ఉండిపో… ఉండిపో తోడుగా నాతోనే
హొయ్యారే హొయ్యారే… హొయ్యా హొయ్యా..
నీ వల్లే నీ వల్లే… పిచ్చోడిలా తయారయ్యా
హోయ్యరే హోయ్యరే … హొయ్యా హొయ్యా..
నీ వల్లే నీ వల్లే… నాలో నేనే గల్లంతయ్యా
ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు