YSR Housing Scheme: వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ కు ఎలా అప్లై చేసుకోవాలి?

YSR Housing Scheme: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్వంత ఇళ్లు లేని పేదలందరికీ స్వంత ఇంటిని కట్టించాలనే ఉద్దేశ్యంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ ను 2020లో ప్రారంభించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేస్తానన్న 9 హామీల్లో ఈ సొంత ఇళ్లు పధకం ఒకటి. ఈ వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ రెండు ఫేజ్ లలో జరుగుతుంది. అయితే ఈ పధకానికి ఎవరు అర్హులు? ఎలా అప్లై చేైసుకోవాలనే పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.

ysr housing scheme

వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ కు ఎవరు అర్హులు?

  • ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్మనెంట్ రెజిడెంట్ అయి ఉండాలి
  • సొంత ఇళ్లు లేదా భూమి కలిగి ఉండకూడదు
  • తెల్ల రాషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి
  • ఆధార్ కార్డు
  • అడ్రస్ ప్రూఫు
  • బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్
  • డోమిసైల్ సర్టిఫికేట్
  • ఇన్ కం సర్టిఫికేట్
  • మొబైల్ నంబర్
  • ఫోటోగ్రాఫ్
  • పూదలందరికీ ఇళ్లు

డిసెంబర్ 25, 2020న సీఎం జగన్ ఈ వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ ను లాంచ్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 30.6 లక్షల బెనిఫీషియరీలు ఉన్నట్లు గా అధికారులు గుర్తించారు. రెండు ఫేజుల్లో ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. మొదటి ఫేజుల్లో 15.1 లక్షల ఇళ్ల నిర్మాణం, రెండవ ఫేజులో 13 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఇంటికి 1.80 లక్షల ఖర్చు అవనుంది. ఆ ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరించనుంది. మొదటి ఫేజు డిసెంబర్ 2020 నుంచి జూన్ 2022 వరకు పూర్తి అవనుంది. ఇక రెండవ ఫేజు జూన్ 2023 వరకు కంప్లీట్ కానుంది.

పేదలకు సొంత ఇంటి నిర్మాణానికి ఇప్పటికే ప్రధాన మంత్రి ఆవాజ్ యోజనా పధకం ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వైెఎస్సార్ హౌసింగ్ స్కీమ్ తో ఆస్కీమ్ ను కలిపి పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఈ పధకం కోసం కేంద్ర ప్రభుత్వం 5వేల కోట్లు ఖర్చు చేయనుండగా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు చేయనుంది.

హౌసింగ్ స్కీమ్ కు అప్లై చేసే విధానం

  • వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ అఫిషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి లాగిన్ అవ్వండి. లేదంటే ఈ లింక్ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వండి వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ వెబ్ సైట్
  • అక్కడున్న అప్లికేషన్ ఫారంను ఫిల్ చేయండి
  • సంబంధిత డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయండి
  • అప్లికేషన్ ను సబ్మిట్ చేసేముందు ఓసారి చెక్ చేసుకోండి
  • అప్లికేషన్ ను సబ్మిట్ చేయండి
  • వైఎస్సార్ హౌసింగ్ అప్లికేషన్ ఫారంని ప్రింటవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి
  • మీరు బెనిఫీషయరీ లిస్ట్ లో ఉన్నారా లేదా ఇలా చెక్ చేసుకోండి
  • అధికారిక వైఎస్సార్ హౌసింగ్ స్కీమ్ వెబ్ సైట్ ను విజిట్ అవ్వండి
  • హోమ్ పేజీపైన ఉన్న బెనిఫీషియరీ లిస్ట్ పైన క్లిక్ చేయండి
  • మీ బెనిఫీషియరీ ఐడీ లేదా రాషన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి
  • సర్చ్ పైన్ క్లిక్ చేయగానే, మీ బెనిఫీషియరీ స్టేటస్ స్క్రీన్ పైన కనిపిస్తుంది.

హౌసింగ్ స్కీమ్ హెల్ప్ లైన్ నంబర్

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు