NREGA Job Application: ఉపాధి హామీ పధకానికి ఎలా అప్లై చేసుకోవాలి?

NREGA Job Application: 2005లో యూపీయే ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పధకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పధకం ద్వారా అర్హులైన ప్రతీ ఒక్కరికి తమ గ్రామ పంచాయితీలో పని కల్పించడం జరుగుతుంది. ఈ పథకం ప్రకారం అర్హులైన ప్రతీ వ్యక్తికీ ప్రతీ సంవత్సరం 100 రోజుల పనిని ఖచ్చితంగా ప్రభుత్వం కల్పించాలి. 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ ఈ ఉపాధి హామీ పధకానికి అప్లై చేసుకోవచ్చు. దీనిని తెలంగాణలో కరువు పని పధకం అని కూడా అంటారు. దీనికి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.

nrega job card application form in telugu

ఉపాధి హామీ పధకానికి ఇలా దరఖాస్తు చేసుకోవాలి

  • మీ గ్రామ పంచాయితీకి వెళ్లి ఉపాధి హామీ దరఖాస్తు ఫారంను తీసుకొని దానిలో వివరాలను నింపాల్సి ఉంటుంది. ఆన్లైన్లో కూడా ఈ దరఖాస్తు ఫారం అవైలబుల్ గా ఉంటుంది
  • అప్లికేషన్ లో మీరు ఏ సమయంలో పని చేయగలరో లాంటి వివరాలను పొందుపరచాల్సి ఉంటుంది. మీకు రోజుకు ఒక పూట మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అంటే కేవలం 4 గంటల పని మాత్రమే కల్పించడం జరుగుతుంది.
  • మీరు అప్లై చేసిన తరువాత వెరిఫికేషన్ చేసి జాబ్ కార్డు అందిస్తారు. ఈ జాబ్ కార్డు కోసం మీరు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. జాబ్ కార్డు పోయినా సరే మీరు మళ్లీ అప్లై చేసుకోవచ్చు.
  • పధకం ప్రకారం, మీరు దరఖాస్తు చేసిన 15 రోజుల్లో మీకు పని కల్పించాల్సి ఉంటుంది. ఒక వేళ మీకు పని కల్పించకుంటే 15 రోజుల తరువాత తేదీ నుంచి మీకు నిదుద్యోగ భృతిని ప్రభుత్వం కల్పిస్తుంది.
  • మీ గ్రామ పంచాయితీ నుంచి 5 కిలోమీటర్ల లోపే పని కల్పించాల్సి ఉంటుంది. అది దాటితే 10 శాతం ఎక్కువ జీతం మీకు చెల్లించాల్సి ఉంటుంది.
  • ఈ పధకం కింద పురుషులకు, మహిళలకు సమానంగా చెల్లించాల్సి ఉంటుంది
  • మీరు పనిచేసే చోట చిన్న పిల్లలు ఉండడానికి, నీళ్లు తాగడానికి, బాత్రూం సౌకర్యాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
  • పధకం కింద పనిచేసే ప్రతీ ఒక్కరికీ మెడికల్ ఇన్షురెన్స్ ఉంటుంది. ఏదైనా ఆక్సిడెంట్ అయితే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
  • జీతం ప్రతీ వారం చెల్లించాల్సి ఉంటుంది లేదా 15 రోజులకి ఓ సారి ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లించాలి.
  • ప్రతీ రోజుకి కనీస వేతనాన్ని రూ.202గా ప్రభుత్వం నిర్ణయింది.
  • కరోనా కారణంగా ఈ ఉపాధి హామీకి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. లాక్ డౌన్ సమయంలో అనేక మంది భౌతిక దూరం పాటిస్తూ.. ఈ ఉపాధి హామీ పధకం కింద పనిచేసారు.
  • వలస కూలీలకు కూడా ఈ ఉపాధి హామీ జాబ్ కార్డును అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

ఉపాధి హామీ పధకం అప్లికేషన్ కావాలంటే ఈ కింది లింక్ పై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ ను మీ గ్రామపంచాయితీల్లో దరఖాస్తు చేసుకోండి

https://drive.google.com/file/d/1AHIyCnNg6QT8TN6gGwNCYSO0Uvfu48XX/view

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు