SBI E Mudra Loan Apply: ఎస్బీఐ బ్యాంక్ ఈ ముద్ర లోన్ కి ఎలా అప్లై చేయాలి

SBI E Mudra Loan Apply: కేంద్రప్రభుత్వం ముద్ర లోన్ ద్వారా అనేక మందికి చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు ఇస్తుంది. ఈ ముద్ర లోన్ ను ఎస్బీఐ బ్యాంక్ ద్వారా ఎలా అప్లై చేసుకోవాలినే వివరాలను ఇక్కడు అందిస్తున్నాము. ముద్రలోన్ అప్లై చేసుకున్నప్పటికీ కేవలం అర్హులకు మాత్రమే ఈ లోన్ సాంక్షన్ అవుతుంది.

sbi e mudra loan rs 50000

ఎస్బీఐ ముద్రా లోన్ కు అప్లై చేసుకునేవారి వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య వారై ఉండాలి. ఎస్బీఐ బ్యాంక్ తో అకౌంట్ కలిగి ఆరు నెలల వరకు అకౌంట్ ను యాక్టివ్ లో ఉంచగలిగిన వారై ఉండాలి.

మద్రలోన్ కు అవసరమయ్యే డక్యుమెంట్లు

  • ఇక్కడున్న డాక్యుమెంట్లన్నీ సాఫ్ట్ కాపీల్లో ఉండాలి, JPEG, PNG లేదా PDF రూపంలో ఉండాలి. 2జీబీలకు మించి సైజ్ ఉండకూడదు.
  • జీఎస్టే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, షాప్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్
  • ఆధార్ కార్డు సాఫ్ట్ కాపీ
  • ఎస్బీఐ సేవింగ్స్ అకౌంట్ నంబర్, ఆధార్ నంబర్
  • ముద్రలోన్ అప్లైచేసే విధానం
  • ఎస్బీఐ ముద్ర లోన్ అధికారిక వెబ్సైట్ ను విజిట్ చేయండి
  • మీకు నచ్చిన భాషను సెలెక్ట్ చేసుకొని ముందుకు వెళ్లండి
  • అన్ని డీటైల్స్ ను ఫిల్ చేయండి
  • ఎస్బీఐ-ఈ-ముద్ర లోన్ కు చెందిన E-Sing తో అంగీకరించండి. E-Sign ప్రయోజనాల కసం మీ ఆధార్ ను లింక్ చేయడానికి చెక్ బాక్స్ పై టిక్ చేయండి
  • ఆధార్ ఎంటర్ చేసిన తర్వాత, మీ మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. అవసరమైన ప్లేస్ లో ఓటీపీను ఎంటర్ చేయండి

ముద్ర లోన్ కు ఎందుకు అప్లై చేసుకోవాలి

  • చిన్న వ్యాపారాలకు తోడ్పాటుగా ఉంటుంది.
  • చిన్న పరిశ్రమలకు నిధులు అందించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
  • సరైన వడ్డీ రేట్లతో లోన్స్ పొందవచ్చు
  • జీడీపీ వృద్ధికి సహాయపడుతుంది
  • ముద్ర యోజన కు అప్లై చేసుకునేందుకు అయ్యే ప్రాససింగ్ ఫీజు కూడా చాలా తక్కువ

మూడు రకాల ముద్ర లోన్స్ ఉంటాయి. శిశు ముద్ర లోని, కిశోర్ ముద్ర లోన్, తరుణ్ ముద్ర లోన్. శిశు ముద్ర లోన్ కింద 50వేల వరకు లోన్ పొందవచ్చు. కిశోర్ ముద్ర లోన్ కింద 50వేల నుంచి 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. తరుణ్ ముద్ర పధకం కింద 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పొందవచ్చు.

ఈ ముద్రలోన్ ఎంతో మంది నిరుద్యోగులకు, చిరు వ్యాపారస్తులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. అవసరమైన వారికి ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి.

 ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు