Watch Telugu Channels In USA: అనేక మంది తెలుగు వారు ప్రపంచంలోని కొన్ని దేశాలను ఉద్యోగ నిమిత్తమై వలస వెళ్లారు. వారి అమెరికా, యూకే లోనే ఉండి మన తెలుగు చానెళ్లను నేరుగా వాచ్ చేయలేరు. మన తెలుగు ఛానెల్స్ ను చూపించే లోకల్ కేబుల్ ఆపరేటర్లు కూడా ఉండరు కాబట్టి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయితే అమెరికా, యూకె, ఆస్టేలియాలో ఉండే మన తెలుగు వారు కూడా ఎలా తెలుగు చానల్స్ ను వాచ్ చేయొచ్చనే విషయాలను తెలుసుకుందాం.
అమెరికాలో తెలుగు చానెల్స్ ను ఇలా వాచ్ చేయండి
స్లింగ్ టీవీ (Sling TV)
స్లింగ్ టీవీ అనేది ఓ పాపులర్ టీవీ స్ట్రీమింగ్ యాప్. ఈ యాప్ మీరు ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని స్మార్ట్ ఫోన్లో కూడా ఉపయోగించవచ్చు. అయితే మీరు తెలుగు చానెల్స్ కు సంబంధించిన ప్యాక్ ను సబ్స్ క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ప్యాక్ లో 45 ఛానెళ్లు ఉంటే ఇంకో ప్యాక్ లో 70 ప్లస్ ఛానెళ్లు ఉంటాయి.
డిష్ టీవీ (Dish TV)
డిష్ టీవీ అనేది అమెరికాలో సేటలైట్ ప్రొవైడర్. అక్కడ మీకు తెలుగుకి సంబంచిన నాలుగు ప్యాక్ లు ఉంటాయి. ఒక ప్యాక్ లో 14 తెలుగు చానెళ్లు, 2వ ప్యాక్ లో 7, 3వ దానిలో 4 ఇంకా 4వ దానిలో 1 చానెల్ ఉంటుంది. అయితే ఈ ప్యాక్ ను పొందాలంటే ముందు మీరు ఇంగ్లీస్ ప్యాక్ లను ఖచ్చితంగా కొనాల్సి ఉంటుంది.
యప్ టీవీ (Yupp TV)
స్లింగ్ టీవీ లాగే యప్ టీవీన యాప్ ను నేరుగా ఇన్స్ టాల్ చేసుకోవచ్చు. ఈ యప్ టీవీలో తెలుగు మాత్రమే కాకుండు ఇండియన్ ల్యాంగ్వేజన్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి.
హాట్ స్టార్ యూఎస్ ( Hotstar (US) )
ఇక్కడ డిస్నీ హాట్ స్టార్ యాప్ ఉన్నట్లే అక్కడ కూడా హాట్ స్టార్ యాప్ ఉంటుంది. అయితే అది అమెరికా కు ప్రత్యేకంగా హాట్ స్టార్ యూఎస్ అని ఉంటుంది. దీనిని ప్రత్యేక ప్రీమియం చార్జ్ తో మీరు సబ్స్ క్రైబ్ చేసుకోవలసి ఉంటుంది. దీంట్లో మీరు అన్ని తెలుగు చానల్స్, ప్రోగ్రామ్స్ ను వీక్షించవచ్చు.
ఆర్ టీఎస్ టీబీ యాప్ (RTS TV App)
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఈ యాప్ లో తెలుగు ప్రోగ్రామ్స్ ను నేరుగా వాచ్ చేయవచ్చు. ఇది గూగుల్ లో అవైలబుల్ గా ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఒరియా టీవీ (Orea TV)
ఇండియన్ టీవీ ప్రోగ్రామ్స్ వాచ్ చేసేందుకు ఇది చాలా పాపులర్ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ యాప్ లో సీరియల్స్ ను ఎప్పటికప్పుడు డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
రెడ్ బాక్స్ టీవీ (Red Box TV)
ఈ రెడ్ బాక్స్ టీవీ చాలా పాపులర్. సుమారు 20 కంటే ఎక్కువ దేశాల్లో ఇది అవైలబుల్ గా ఉంది. దాదాపు 1000కి పైగా టీవీ చానల్స్ ఈ రెడ్ బాక్స్ లో స్ట్రీమ్ అవుతాయి.
మీరు గనుక ఈ దేశాలకు వెళ్తే లేదా మీ శ్రేయోభిలాషులు అక్కడ ఉండి తెలుగు చానల్స్ చూడలేక పోతీ వారికి ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి.
ఇవి కూడా చూడండి
- SBI E Mudra Loan Apply: ఎస్బీఐ బ్యాంక్ ఈ ముద్ర లోన్ కి ఎలా అప్లై చేయాలి
- NREGA Job Application: ఉపాధి హామీ పధకానికి ఎలా అప్లై చేసుకోవాలి?
- YSR Bheema Status Check: వైఎస్సార్ భీమా స్టేటస్ ను ఇలా చెక్ చేసుకోండి
- How To Activate Airtel Hello Tunes: ఫ్రీగా ఎయిర్ టెల్ హలో ట్యూన్స్ ను ఇలా యాక్టివేట్ చేసుకోండి