MLA Salary In Ap: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యే సాలరీ ఎంత?

MLA Salary In Ap: దేశం రాష్ట్రాలుగా విభజనపొంది అ తరువాత రాష్ట్రాం జిల్లాలుగా విభజన అవుతుంది. జిల్లా నియోజకవర్గాలుగా విభజన అవుతుంది. ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో ఎమ్మెల్యే ఉంటారు. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 175 ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వంలో చాలా కీలక స్థానాల్లో ఉన్న వీరికి నెల జీతం ఎంత అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. వాటి వివరాలను మీకు ఈ ఆర్టికల్ లో అందిస్తున్నాము.

mla-salary-in-ap

మొత్తం నియోజక వర్గాల ప్రతినిధిగా ఎమ్మెల్యే ఉంటాడు. ప్రజల తరపున ప్రభుత్వంలో ప్రతినిధిగా ఉంటాడు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారించే ప్రయత్నం చేస్తుంటాడు.

ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేకు ఇచ్చే జీతం నెలకు రూ. 1లక్ష, 25 వేలు. బేసిక్ సాలరీ 12వేలు కాగా, కాన్స్ టిట్యుయెన్సీ అలొవెన్సుల కింద రూ.1లక్ష 13వేలు ను ప్రతీ నెల పొందుతాడు.

ఎమ్మెల్యే బాధ్యతలు (MLA Responsibilities)

  • క్యాబినెట్ లో స్థానం సంపాదించిన ఎమ్మెల్యేలు తమ విభాగాలన్నింటికీ సూపర్వైజ్ చేయాలి. ఎక్కువ సమయాన్ని కేటాయించాలి
  • ప్రతిపక్షాల ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు ఇవ్వాలి.
  • ప్రభుత్వంలోని వివిధ కమిటీలకు సభ్యులుగా కూడా ఎమ్మెల్యేలు పనిచేస్తారు.
  • తమ నియోజకవర్గంలోని అన్ని సమస్యలపై దృష్టి పెడతారు. వాటిని పరిష్కరించే చర్యలు చేపడతారు
  • ప్రతీ ఎమ్మెల్యే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఒక కార్యాలయాన్ని కూడా ఓపెన్ చెయ్యవచ్చు

ఎమ్మెల్యే కావడానికి కావాల్సిన అర్హత

  • భారత దేశ పౌరులై ఉండాలి
  • 25 ఏళ్లు నిండిన వారై ఉండాలి
  • ప్రభుత్వంలో పని చేయని వారై ఉండాలి
  • కోర్టు చేత క్వాలిఫై చేయబడిన వారై ఉండాలి

ఎమ్మెల్యే ఎలా ఎన్నిక అవుతారు?

రాష్ట్రంలో ప్రతీ 5 సంవత్సరాలకు ఓ సారి ఎన్నికలు జరుగుతాయి. పై క్వాలిఫికేషన్స్ ఉన్న ఎవరైనా సరే ఈ ఎన్నికల్లో పాల్గొనవచ్చు. ఏదైనా ఒక పార్టీ తరపున లేదా ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగాలి. నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్ధికి ప్రత్యేక వోటింగ్ సింబల్ ను కేటాయిస్తారు. పోటీ చేసిన అభ్యర్ధికి ఆ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువ వోట్లు వస్తే అతనే ఎమ్మెల్యే అవుతాడు. ఆ నియోజకవర్గం తరపున రాష్ట్ర అసెంబ్లీలో సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాడు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు