Ugadi Festival: ఉగాది పండగ ప్రాముఖ్యం

Ugadi Festival: ఉగాదిని తెలుగు న్యు ఇయర్ అని, తెలుగు వారి నూతన సంవత్సరంగా గుర్తిస్తారు. ఉగాది పండగ రోజున చేసే పచ్చడి రుచి నోటితో చేప్పలేనిది. అన్ని రకాల రుచులో ఆ పచ్చడిలో ఉంటాయి. తెలుగు వారి మొదటి పండగ ఉగాదేనని అంటారు పెద్దలు. ఈ పండగ గురించిన మరిన్ని విశేషాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

ugadi

ఉగాది అనే పదం యుగాది నుంచి వచ్చింది. అంటే యుగం ప్రారంభం అయ్యే రోజు. ఉ అంటే నక్షత్రం అని, గ అంటే గమనం అనే అర్ధం కూడా వుంది. ఉగాది రోజున తెలుగు వారు ఇళ్లు, వాకిలిని బాగా శుభ్రపరుచుకొంటారు, తలంటు స్నానాలు చేసి కొత్త బట్టలు ధరిస్తార.

ఉగాది జరుపుకొనే రోజు.. అంటే చైత్ర శుద్ధ పాఢ్యమి రోజే బ్రహ్మ దేవుడు విశ్వాన్ని సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.

ఉగాదికి వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లు ఉన్నాయి

  • ఆంధ్ర, కర్ణాటక – ఉగాది
  • మహారాష్ట్ర – గుడిపడ్వా
  • తమిళులు – పుత్తాండు
  • మళయాళీలు – విష్ణు
  • పంజాబీలు – వైశాఖి
  • బెంగాలీలు – పొయ్ లా బైశాఖ్
  • అస్సాం – బిహు
  • కేరళా – కొళ్ల వర్షం

ఉగాది ప్రత్యేకతలు

వసంతరుతువు ప్రారంభమైన ఆ రోజున. షడ్రుచులతో పచ్చడిని చేస్తారు. ఈ పచ్చడి, తియ్యగా, ఉప్పగా, కారంగా, చేదుగా, వగరుగా ఇలా అన్ని రుచులు కలగలసి ఉంటుంది. ఈ పండగ తరువాతనే అందరి తెలుగువారి ఇళ్లల్లో మామిడికాయలతో పచ్ఛళ్లు చేసుకుంటారు.

పంచాంగ శ్రవణం

ఈ ఉగాది రోజున పండితులు పంచాంగం చదువుతారు. ఈ పంచాంగం ద్వారా ఏ రాశి వారికి ఎలాంటి లాభ నష్టాలు జరుగుతాయి. ప్రభుత్వం, దేశ పరిస్థితి ఎలా ఉండబోతోంది లాంటి విషయాలను చెబుతారు. పంచాంగంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు.

కవి సమ్మేళనం

సాయంకాలం కవులందరూ ఒక చోటకు చేరి కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. ఇందులో కవితలు, పద్యలు పాడటం లాంటివి చేస్తారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు