Rabindranath Tagore Biography: రబీంద్రనాథ్ ఠాగూర్ బయోగ్రఫీ, గీతాంజలి

Rabindranath Tagore Biography: రబీంద్రనాథ్ ఠాగూర్ గురించి తెలియని వారు ఉంటారేమే గానీ ఆయన పేరు వినని భారతీయులు ఉండరు. కవి, నోబెల్ ప్రైజ్ విజేత, గీతాంజలి రచయిత, గొప్ప కళాకారుడు ఇలా ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి. కవిత్వానికి ఠాగూర్ ప్రత్యేకం. రబీంద్రనాథ్ రాగూర్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

rabindranath-tagore-biography-in-telugu

రబీండ్రనాథ్ ఠాగూర్ 1861 మే 7న కలకత్తాలో జన్మించారు. రబీంద్రనాథ్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మసమాజ్ లో ఉండడం ద్వారా అందులోని ఛాందసవాదాన్ని వ్యతిరేకించి కుటుంబ సభ్యులకు కూడా ఆంగ్లం నేర్చుకోమని ప్రోత్సహించేవారు.

చిన్న వయసు నుంచే రబీంద్రనాథ్ ఠాగోర్ సాహిత్యం పై మొగ్గు చూపారు. స్కూలింగ్ ను ఇంటివద్దనే పూర్తి చేశారు. 1878లో ఠాగూర్ ఇంగ్లాండ్ కు వెళ్లారు అయితే అక్కడ డిగ్రీని పూర్తి చేయలేకపోయారు. 1901లో ఇండియాకు తిరిగివచ్చి ఇక్కడ శాంతినికేతన్ అనే ఆశ్రమాన్ని స్థాపించారు.

గాంధీతో రబీంద్రనాథ్ ఠాగూర్ కే మంచి స్నేహం ఉండేది. కానీ గాంధీ అహింసా పోరాటాన్ని కొంత వరకు వ్యతిరేకించేవారు. గాంధీతో విభేదాలు ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి స్వాతంత్ర్య సాధనకు ఎంతో కృషి చేశారు.

1913లో “గీతాంజలి” రచించినందుకు గాను ఆయనకు సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ లభించింది. ప్రపంచలోని ఎందరో ప్రముఖులతో ఠాగూర్ కు మంచి స్నేహం ఉంది. అయిన్ స్టీన్, జార్జ్ బెర్నార్డ్ షా, రొమైన్ రొల్లాండ్, రాబర్ట్ ఫ్రాస్ట్, డబ్ల్యూబి యిట్స్ ఇలా ఎందరితోనే ఠాగూర్ సాహిత్యం పై మాట్లాడేవారు.

1919లో జల్లియన్ వాలా భాఘ్ ఉదందానికి నిరసనగా ఠాగూర్ నైట్ హుడ్ బిరుదును తిరిగి ఇచ్చేశారు. రబీంద్రనాధ్ ఠాగూర్ జాతీయవాదం పై ఎన్నో గీతాలు రాసినప్పటికీ అంతర్జాతీయవాదాన్నే సమర్ధించేవారు.

ఠాగూర్ 1941 ఆగస్టు 7న దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ ఇంట్లోనే తుది శ్వాస విడిచారు. రబీంద్రనాథ్ రచించిన గీతాంజలికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది. ఆయన కళలపై, ప్రకృతిపై ఎన్నో గీతాలను, కవిత్వాలను రచించారు.

ఠాగూర్ కోట్స్

  • పరబాషా ద్వారా బోధన అంటే సోపానాలు లేని సౌధం లాంటిది.
  • కాలం చెక్కిలిపై కన్నీటి చుక్క తాజ్‌మహల్.
  • ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది.
  • మనము ఎవరిని హీనులుగా, నీచులుగా చూస్తామో వాళ్లే మనల్ని క్రమంగా, హేయంగా, దీనంగా చూస్తారు.
  • అజ్ఞానమనేది విజ్ఞానము వైపుకు పయనించవచ్చు కానీ మూఢత్వమనేది మరణానికి దారి తీస్తుంది.
  • మంచి పనులు చేస్తూ తీరుబాటు లేకుండా ఉండే వ్యక్తికి సుఖంగా జీవించడానికి కాలం దొరకదు.
  • ప్రతి గడిచిన రోజూ మనమేదైనా నేర్చుకున్నదై ఉండాలి.
  • అబద్దం గురించి కూడా నేను తప్పక నిజమే పలుకుతాను.
  • ఎవరైనాసరే నేర్చుకుంటూ ఉంటేనే తప్ప సరిగా బోధించలేరు.
  • అసమర్ధులకు అవరోధాలుగా కనిపించేవి సమర్ధులకు అవకాశాలుగా కనిపిస్తాయి.
  • జీవితంలో వైఫల్యాలు భారమని గ్రహించేవారు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవచ్చు.
  • మనిషి జీవితంలో వచ్చే ప్రతిరోజూ, క్రితం రోజుకన్నా కాస్తో కూస్తో ఎక్కువ విషయాలను నేర్చుకోవాలి.
  • నేను పని చేస్తే భగవంతుడు నన్ను గౌరవిస్తాడు. అయితే నేను గానం చేసినపుడు ఆయన నన్ను ప్రేమిస్తాడు.
  • కళ్లకి రెప్పలు ఉన్నట్లే పనికి విశ్రాంతి ఉండాలి.
  • భర్తకి లోకమంతా ఇల్లు, అయితే స్త్రీకి ఇల్లే లోకం.
  • వెలిగే దీపంలాగా ఉండు. అప్పుడే ఇతర దీపములను వెలిగించవచ్చు.
  • ప్రేమ గుణం బాగా పెరిగితే లభించే సంపద-పవిత్రత.
  • సృష్టి రహస్యాన్ని విశదం చేయగల శక్తి తర్క కౌశలానికి లేదు.
  • మనస్ఫూర్తిగా ప్రేమించే స్త్రీల మధ్యలో పురుషులు పసిబిడ్డలు.
  • మనిషి జీవితంలో మహదాశయాలూ శిశువుల్లా అవతరిస్తుంటాయి.
  • ఒక వ్యక్తి తాను అనుభవించిన ఆనందాన్ని ఇంకొకరిలో కలిగించడానికి చేసే ప్రయత్నమే ‘కళ’.
  • నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం పది అడుగులు ముందుకు వస్తుంది.
  • సౌందర్యం, సత్యం వీటి రసవత్సమ్మేళనమే కళ

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు