APJ Abdul Kalam Biography In Telugu: అబ్దుల్ కలాం బయోగ్రఫీ తెలుగులో

Apj Abdul Kalam Biography In Telugu: ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ తెలిసి వ్యక్తే. మిసైల్ మ్యాన్ గా చాలా పాపులర్. మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేశారు. 90’s కిడ్స్ ఆయన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేరు. డీఆర్డీఓ లో సైంటిట్స్ గా కెరీర్ మొదలుపెట్టి భారత సంరక్షణ కోసం అగ్ని అనే క్షపణిని తయారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అబ్దుల్ కలాం గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

apj-kalam

కలాం బాల్యం, విద్య

అబ్దుల్ కలాం పూర్తి పేరు అవుల్ పకీర్ జైనలుబ్దాన్ అబ్దుల్ కలాం. అక్టోబర్ 15, 1931లో ఓ తమిళ ముస్లిం కుటుంబంలో రామేశ్వరంలో జన్మించాడు. కలాం తండ్రి మరకయర్ అక్కడే లోకల్ మాస్క్ లో ఇమామ్, బోట్ ఓనర్ కూడా. కలాం కుటుంబాన్ని పేదరికం ఆవరించడంతో కలాం చిన్నప్పుడే పేపర్లు వేసి డబ్బులు సంపాదించాడు కానీ ఎప్పటికైనా పైలట్ అవ్వాలనే ఆశయం కలాంకు ఉండేది. కలాంకు నలుగురు సోదరులు ఒక సోదరి.

1960లో కలాం మడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత పైలట్ అవుదామని డీఆర్ఢీఓలో ఏరొనాటికల్ విభాగంలో జాయిన్ అవుతాడు. వెంటనే తక్కువ సమయంలో మంచి పేరు సంపాదించుకొని ఓ హోవ్ క్రాఫ్ట్ ను తయారు చేస్తారు. ప్రముఖ సైంటిస్టు విక్రం సారాభాయి టీంలో కూడా కలాం పనిచేశాడు. 1969లో కలాంను ఇస్రోకు బదిలీ చేస్తారు. 1980లో రోహిణీ సాటలైట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

కలాం ఢీఆర్డీఓ కెరీర్

1990 లో కలాం “పీఎస్ఎల్వీ” సాటలైట్ ను డెవలప్ చేయాలని నిర్ణయించారు. దానికి ప్రభుత్వం కూడా ఓకే చెప్పింది. దేశంలో మొదటిసారి న్యూక్లియార్ బాంబ్ టెస్ట్ ప్రయోగించేటప్పుడు ప్రముఖ సైంటిస్ట్ రాజా రామన్న నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. ప్రధాని ఇంద్రా గాంధీ సైతం కలాం సేవలను మెచ్చుకునేది. సీక్రెట్ గా ఆయన చేపట్టే ప్రాజెక్స్ కు ఫండ్స్ సాంక్షన్ చేసేది.

1992 నుంచి 1999 వరకు డీఆర్డీఓకు సెక్రటరీగా పనిచేశారు. ప్రధాన మంత్రికి ఛీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్ గా పనిచేశారు. ఈ సమయంలోనే ప్రతిష్టాత్మకమైన పోక్రాన్ 2 అణు పరీక్షలను నిర్వహించారు. 2002లో డా. కె నారాయన్ తరువాత కలాం రాష్ట్రపతిగా నియమితులయ్యారు. వోటింగ్ లో లక్ష్మీ సెహగల్ కన్నా అధిక వోట్ల మెజారిటీతో కలాం విజయం సాధించారు. లక్ష్మీ సెహగల్ కు లక్షా 7వేల ఓట్లు వస్తే.. కలాం కు 9లక్షల 22వేల ఓట్లు వచ్చాయి.

ప్రజల రాష్ట్రపతిగా కలాం

ప్రజల రాష్ట్రపతిగా కలాం మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. మూడవ భారత రత్న అవార్డు పొందిన రాష్ట్రపతిగా కలాం గుర్తింపు పొందాడు. ప్రెసిడెంట్ అయిన మొదటి సైంటిస్టు, మొదటి బ్రహ్మచారీ కలాం మాత్రమే. ఆయన రాసిన “వింగ్స్ ఆఫ్ ఫైర్” పుస్తకం చాలా పాపులర్. 2015 జులై 27న కలాం పర్యావరణంపై ఓ లెక్చర్ ఇవ్వడానికి శిల్లాంగ్ కు బయల్దేరతాడు. అయితే అక్కడే సాయంత్రం 6.35నిమిశాలకు కలాం హార్ట్ ఎటాక్ తో ఒక్కసారిగా కుప్ప కూలిపోతారు.

కలాం అంతిమసంస్కారాలను ఆయన స్వస్థలం రామేశ్వరంలో నిర్వహించారు. 30 జులై 2015న సుమారు 3లక్షల 50వేల మంది అంతిమయాత్రకు హాజరయ్యారు. వివిధ దేశాల అధ్యక్షలు, రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆయన మరణంపై తీవ్ర సానుభూతిని వ్యక్తం చేశారు.

2017 జులైలో రామేవ్వరంలోని డీఆర్డీఓ సెంటర్ లో అబ్దుల్ కలాం స్మారకంగా అబ్దుల్ కలాం నేషనల్ మెమోరియల్ ను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు