Srinivasa Ramanujan Biography: శ్రీనివాస రామానుజన్ బయోగ్రఫీ, మ్యాథమెటీషియన్

Srinivasa Ramanujan Biography: శ్రీనివాస రామునుజన్.. ఈ పేరు దాదాపు చదువుకున్న అందరూ వినుంటారు. ఈయన చిత్రాన్ని ప్రభుత్వ గణిత పుస్తకాల కవర్ పేజీ పైన కూడా ఎన్నో సార్లు ముద్దించారు. అసలు ఈ శ్రీనివాస్ రామానుజన్ ఎవరు ఆయన గణితంలో ఏమి సాధించారు లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

srinivasa-ramanujan-history-in-telugu

శ్రీనివాస రామానుజం బాల్యం, విద్య

శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న బ్రిటీస్ కాలం, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో జన్మంచారు. ఆయన మొత్తం పేరు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. బ్రాహ్మణ కుటుంబంలో ఆయన జన్మించారు. 1913లో రామానుజన్ “జీహెచ్ హార్డీ” దగ్గర కరస్పాండెన్స్ లో మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం ప్రారంభిస్తాడు. రామానుజం అద్భతమైన వర్క్, మ్యాథ్స్ స్కిల్స్ చూసి హార్డీ క్యాంబ్రిడ్జ్ కు పంపే ఏర్పాటు చేస్తాడు.

రామునుజన్ మ్యాథమెటిక్స్ చరిత్రలోనే ఎన్నో కొత్త థీయరీలను, ఈక్వేషన్స్ ను కనుగ్గొన్నాడు. రామానుజన్ తన జీవితంలో సుమారు 3600ల థీయరీలను కనుగ్గొన్నట్లు చెబుతారు. ఈ థీయరీలన్నీ నవల రూపంలో ఉన్నాయి. గణిత సముద్రంలో మునిగి తేలాడు రామానుజన్.

రామానుజన్ కనుగ్గొన్న థీయరీల్లో రామానుజన్ ప్రైమ్, రామానుజన్ తీటా ఫంక్షన్, పార్టీషన్ ఫార్ములా, మాక్ తీటా ఫంక్షన్స్. క్యాంబ్రిడ్జ్, ఫెల్లో ట్రినిటీ కాలేజ్ కు ఎంపికైన ఒకే ఒక్క భారతీయుడు రామానుజన్.

1919లో రామానుజన్ హెపాటిక్ అమీబియాసిస్ వ్యాధికి గురయ్యారు. 1920లో 32ఏళ్ల వయసులో రామానుజన్ మృతి చెందాడు. తాను హార్డీకి చివర్లో రాసిన లేఖలో.. తాను ఇంకా కొత్త మ్యాథమెటిక్ కాల్కులేషన్స్ కనుక్కునే పనిలో ఉన్నట్లు చెబుతాడు.

రామానుజన్ మ్యాథమెటిక్స్ లో రాజు అయినప్పటికీ తనకు వచ్చిన ప్రతీ కొత్త ఈక్వేషన్ దేవుడి నుంచి వచ్చిందేనని నమ్మేవాడు. రామానుజన్ కుటుంబం కూడా.. దేవీ నమగిరి తయ్యర్ ఆశీస్సుల వల్లే గణితంలో రామానుజన్ గొప్పవాడయ్యాడని ఆ తరువాత చెప్పారు.

తమిళనాడులోని కుంభకోణంలో సారంగపాని సన్నిధి వీధిలో రామానుజన్ ఇళ్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంటిని మ్యూజియంగా మార్చారు. రామానుజన్ తండ్రి పనులలో బిజీగా ఉండడంతో తల్లి వద్దే రామానుజన్ పురాణాలను నేర్చుకున్నాడు.

రామానుజన్ 32ఏళ్ల వయసులోనే ఎంతో సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఎంతో గుర్తింపు, కీర్తి లభించింది. తమిళనాడు ప్రభుత్వం డిసెంబర్ 22న రామానుజన్ జన్మదినాన్ని స్టేట్ ఐటీ డే గా సెటబ్రేట్ చేసుకుంటుంది.

2011లో భారత ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. రామానుజన్ 125వ జయంతి సందర్భంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 22న నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు