Professor Jayashankar Biography: ప్రొఫెసర్ జయశంకర్ బయోగ్రఫీ, తెలంగాణ ఉద్యమం

Professor Jayashankar Biography: ప్రొఫెసర్ జయశంకర్.. ఈ పేరు వినని తలంగాణ వ్యక్తి ఉండరు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధించే క్రమంలో జయశంకర్ కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యాయుడిగా కెరీర్ మెదలుపెట్టి ఎన్నో కీలకబాధ్యతలను నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు గురువు అని కేసీఆరే అనేక సందర్భాల్లో చెప్పారు. జయశంకర్ గురించి మరిన్న విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Professor Jayashankar Biography

జయశంకర్ పూర్తిపేరు కొత్తపల్లి జయశంకర్. ఆయన 1934 ఆగస్టు 6న వరంగల్ లోని హన్మకొండ, ఆత్మకూర్ మండలంలో విశ్వకర్మకమ్యూనిటీలో జన్మించారు. పాఠశాల విద్యను హన్మకొండలోనే పూర్తి చేసి, అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. నిజాం కాలంలోనే స్కూలింగ్ పూర్తిచేశారు కాబట్టి జయశంకర్ కు ఉర్దూ భాషపైన మంచి పట్టు ఉంది. ఆంగ్లం, హిందీ, తెలుగు భాషల్లో కూడా ప్రావీణ్యం ఉంది.

స్కూల్ లో చదివే సమయంలో పిల్లలని ఏదైనా పాటపాడమన్నప్పుుడు నిజాం రూల్స్ ను అతిక్రమించి 6వ తరగతిలోనే వందేమాతరం గీతాన్ని పాడాడు జయశంకర్. జయశంకర్ మొత్తం జీవిత గాధని , బయోగ్రఫీని కొంపల్లి వెంకట్ గౌడ్ రాసిని “వొడువని ముచ్చట” పుస్తకం ద్వారా తీసుకువచ్చారు.

తెలంగాణ ఉద్యమమే కెరీర్ గా

తెలంగాణ ఉద్యమంలో నిజాం కాలం నుంచి జయశంకర్ కీలక పాత్ర పోశించాు. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. 1962 ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. 1968 లో లెక్చరర్ గా పనిచేస్తున్నప్పుడు ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం మరోసారి రగిలింది. అప్పుడు కూడా జయశంకర్ కీలక పాత్ర పోషించారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా జయశంకర్ కు పేరు ఉంది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జయశంకర్ జీవితం మొత్తం కృషి చేశారు. తెలంగాణ జనసభను ఏర్పాటు చేశారు. న్యూస్ పేపర్లో, మ్యాగజైన్లలో తెలంగాణ రాష్ట్ర సాధనపై ఎన్నో ఆర్టకల్స్ రచించారు. అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ను 1999 లో ఏర్పాటు చేశారు. తెలంగాణ ఐక్యవేదికను కూడా ఆయన స్టార్ట్ చేశారు. 2009లో సిఎం కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టినప్పుడు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసింది కూడా జయశంకరే.

జయశంకర్ తెలంగాణ విషయంలో ఎప్పుడూ ఓ మాట అంటుండేవారు. ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాల. జీవితంలో ఎన్నో కీలక బాధ్యతలను నిర్వహించారు. 1991 కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గా, సెంట్రల్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ ఆండ్ ఫారన్ లాంగ్యేజ్ కి రిజిస్టార్ గా.

జయశంకర్ వివాహం చేసుకోలేదు. చనిపోయేంతవరకు బ్రహ్మచారిగానే ఉన్నారు. 2011, జూన్ 11న ఉదయం 11.15నిమిశాలకు పొట్ట క్యాన్సర్ తో బాధపడుతూ తుది శ్వాస విడిచారు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు