Birla Mandir Full Details: హైదరాబాద్ లోని బిర్లా మందిర్ చరిత్ర, పూర్తి వివరాలు

Birla Mandir Full Details: హైదరాబాద్ లో ఉండే ఎన్నో అందమైన ప్రదేశాల్లో, కట్టడాల్లో బిర్లా మంది ఒకటి. హుస్సేన్ సాగర్ కు దక్షిణ వైపున ఇది ఉంటుంది. కాలా పహాడ్ పైన ఈ దీవాళయం నిర్మితమైంది. దేశంలో దేవాళయాల నిర్మాణానికి పేరు గాంచన బిర్లాలు దీన్ని 1976లో నిర్మిచారు. రాజస్తాన్ నుంచి పాలరాయిని దిగుమతి చేసుకొని దీన్ని నిర్మిచారు. రాత్రి సమయంలో ఈ బిర్లా మందిర్ తెల్లగా, కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది.

hyderabad-birla-mandir-full-details-of-telangana-history

బిర్లా మంది నిర్మాణంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఆలయం ఒరియా దేవాలయాలను పోలి ఉంటుంది. బయటనుంచి ఆలయాన్ని చూడగానే పూరీ జగన్నాధ్ ఆలయంగా కనిపిస్తుంది. ఆలయం లోపల రామాయణం, మహాభారతాన్ని పాలరాతిపై చక్కగా చెక్కారు. ఆలయంలో కొలువై ఉండేది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ ఆలయంలో శివుడు, గణపతి, సరస్వతి, హనుమంతుడు, బ్రహ్మ, లక్ష్మి, సాయిబాబులకు ప్రత్యక మందిరాలు ఉన్నాయి.

11 అడుగుల విగ్రహం

రామకృష్ణ మిషన్ కు చెందిన రంగనాధానంద స్వామి మొదటి సారి ఈ ఆలయంలో రంగప్రవేశం చేసి పునీతం చేశారు. బిర్లా మందిర్ లో వాస్తు అద్భుతంగా ఉంటుంది. నగరం నడిబొడ్డులో ఆలయం ఉన్నా.. ఆలయపరిసరాల్లోకి ఎంటర్ కాగానే వాతావరణం మొత్తం వేరుగా ఉంటుంది. శ్రీశైలం, తిరుపతి లాంటి దేవాలయాలకు వెళ్లిన అనుభవం కలుగుతుంది. ఆలయం లోపల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క 11 అడుగుల విగ్రహం ఉంది.

బిర్లా మందిర్ ను బిర్లా ఫౌండేశన్ వారు నిర్మిచారు. 13 ఎకరాల స్థలంలో 280 అడుగుల ఎత్తులో ఈ మందిర నిర్మాణం జరిగింది. దేశంలో ప్రముఖ దేవాలయాళ నిర్మాణానికి బిర్ల ఫౌండేశన్ కు ప్రముఖ స్థానం ఉంది.

రాత్రి కాంతులతో మెరుస్తూ..

సాయంత్రం వేళల్లో బిర్లా మందిర్ అందం రెట్టింపు అవుతుంది. హుసేస్ సాగర్ లేక్ వద్ద నుంచి చూస్తే.. తెల్లగా మెరుస్తూ.. బిర్లా మందిర్ మనకు కనిపిస్తుంది. హైదరాబాద్ లోని సుందరమైన ప్రదేశాల్ని చూడడానికి వచ్చిన వారు బిర్లా మందిర్ ను చూడలేక పోతే.. ఒక అందమైన లొకేషన్ ను మిస్ అయినట్లే. సికింద్రాబాద్ స్టేషన్ నుండి కేవలం 5 కిలోమీటర్లలోపే ఈ మందిరం ఉంది. సికింద్రబాద్ నుంచి 15 నుంచి 20 నిమిశాల్లో మీరు బిర్లా మందిర్ చేరుకోవచ్చు.

బిర్లామందిర్ ను ఎమ్మెమ్ టీఎస్ ద్వారా చేరుకోవాలంటే.. లక్డీకపూల్ స్టేషన్ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. బస్సులో వెళ్లాలనుకుంటే.. సికింద్రబాద్ నుంచి 5k, 20p, 8A బస్సులు ఉంటాయి. బిర్లా మందిర్ తెరిచి ఉంచే సమయం: ఉదయం 7 నుంచి మధ్యహ్నం 12వరకు, మళ్లీ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు