Mahatma Gandhi Biography: జాతి పిత మహాత్మా గాంధీ అంటే తెలియని వారు భారతదేశంలో ఎవరూ ఉండరు. ఇంటికి తండ్రిలా ఆయన మన దేశానికి జాతిపిత. రెండురోజులకు ఓ సారి మనమ ఆయన చిత్రాన్ని లేదా పేరుని లేదా విగ్రహాన్ని, నోట్ల కట్టలమీదరో, వీధుల్లోనో చూసి ఉంటాం. మహాత్మా గాంధీ అసలు పేరు ఏంటి? ఆయన ఎక్కడ చదువుకున్నారు? స్వాతంత్ర్యపోరాట ఉద్యమంలోకి ఎలా వచ్చారు? లాంటి విషయాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం
బాల్యం
మహాత్మా గాంధీ అసలు పేరు మోహన్దాస్ కరంచంద్ గాంధీ. ఆయన అక్టోబర్ 2, 1869, గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో జన్మించారు. గాంధీ తండ్రి కరంచంద్ గాంధీ అప్పటి పోర్బందర్ ప్రాంతానికి ఛీఫ్ మినిస్టర్ గా వ్యవహరించారు. తల్లి పుత్లిబాయ్ హౌస్ వైఫ్, దేవుడి పై అపారమైన నమ్మకం ఆమెకు ఉండేది. 1887 లో గాంధీ మెట్రిక్యులేషన్ ను పూర్తి చేసారు. వైశ్యుల కుటుంబంలో పుట్టిన గాంధీ శాఖాహారి. 1888లో డిగ్రా చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లాడు.
వివాహం
1896లో గాంధీకి కస్తుర్బాతో వివాహం అవుతుంది. గాంధీ సౌత్ ఆఫ్రికాలో లా ప్రాక్టీస్ చేస్తారు. దాదాపు 2 దశాబ్దాలు గాంధీ అక్కడే ఉంటారు. అక్కడ నల్లజాతీయులపై, భారతీయులపై చూపిన వివక్షను వ్యతిరేకిస్తాడు. 1914లోర సౌత్ ఆఫ్రికా నుంచి భారత్ కు రిటర్న్ వస్తాడు. అప్పుడే మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుంది.
రాజకీయరంగ ప్రవేశం
గాంధీ భారత్ లోని రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటాడు. 1919లోర మొదటి సారి రవులత్ చట్టానికి వ్యతిరేకంగా బ్రిటిషర్లపై పోరాటం చేస్తారు. 1920 వరకు గాంధీ భారత్ లో ఓ పెద్ద లీడర్ గా అవతరిస్తారు. అప్పటి నుంచి కంటిన్యుయస్ గా స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేస్తాడు. 1887లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటవుతుంది. 1914 నుంచి గాంధీ కాంగ్రెస్ తో కలిసి పోరాటంలో దిగుతాడు.
1930లో గాంధీ, సరోజిని నాయుడు ఇంకా ఇతర ప్రముఖులు కలిసి నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం మొత్తం దేశాన్నే ఊపేస్తుంది. గాంధీ హింసా పోరాటాలకు వ్యతిరేకం. అహింసాయుతంగా గాంధీ స్వతంత్ర్యపోరాటాన్ని నిర్వహించేవారు. 1942లో క్విట్ ఇండియా మూవ్ మెంట్ పోరాటానికి నాయకత్వం వహిస్తారు. బ్రిటీషర్లు భారత్ విడిచి వెళ్లపోవాలను సత్యాగ్రహానికి దిగుతారు. 1944లో గాంధీ సతీమని కస్తర్బా గాందీ మరణిస్తంది.
ఎట్టకేలకు గాంధీ 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో బ్రిటీషర్లు దిగివస్తారు. స్వాతంత్ర్యం ఇవ్వడానికి సిద్ధమవుతారు. ముస్లిముల ప్రతినిధి మహమద్ అలీ జిన్నాతో కలిసి భారత్ ను 2 భాగాలుగా.. అంటే భారత్ పాకిస్థాన్ గా విభజిస్తారు.
1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్ లో హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు భారత్ విభజనను అంగీకరించలేదు. పాకిస్థాన్ ఏర్పాటు పై వారు తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. గాంధీయే దానికి ముఖ్య కారణమని అనేవారు. వారిలో ఒకరైన గాడ్సే.. 1948లో జనవరి 30న తుపాకీతో గాంధీని కాల్చి చంపుతాడు. గాంధీ చివరిసారిగా హే రామ్ అంటూ తుది శ్వాసను విడుస్తారు.
- మహాత్మాగాంధీ జనన: అక్టోబర్ 2, 1869
- జన్మించిన ప్రదేశం: పోర్బందర్, గుజరాత్
- సతీమణి పేరు: కస్తూర్బా గాంధీ
- వృత్తి: న్యాయవాది, రాజకీయవేత్త, కార్యకర్త, రచయిత
- పిల్లలు: హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రాందాస్ గాంధీ, దేవదాస్ గాంధీ
- తండ్రి: కరంచంద్ ఉత్తమ్ చంద్ గాంధీ
- తల్లి: పుత్లీభాయి గాంధీ
- మరణించిన తేది: జనవరి 30, 1948
ఇవి కూడా చూడండి
- Garikapati Narasimha Rao Biography: గరికపాటి నరసింహారావు బయోగ్రఫీ, పండితులు, జ్ఞాన బోధకుడు
- Kiran Bedi Biography: భారతదేశ మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్
- Sachin Tendulkar Biography: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ బయోగ్రఫీ
- PV Narasimha Rao Biography: పీవీ నరసింహారావు బయోగ్రఫీ