Bhagath Singh Biography: భగత్ సింగ్ బయోగ్రఫీ, స్వాతంత్ర్య పోరాటం

Bhagat Singh Biography: భగత్ సింగ్.. ఈ పేరు వినగానే నరాల్లో నెత్తురు హైస్పీడ్ తో ప్రవహిస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్వాతంత్ర్య ఉద్యమంలో రాజీలేని పోరాటం చేశాడు భగత్ సింగ్. గాంధీ అహింసా పోరాటాన్ని వ్యతిరేకించారు. హింసా మార్గంలోనే స్వాతంత్ర్యం సిధ్దిస్తుందని నినదించాడు. భగత్ సింగ్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం.

bhagat-singh-life-story-in-telugu

భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్ ప్రావిన్స్ లో జన్మించాడు. భగత్ సింగ్ కుటుంబం స్వాతంత్ర్యపోరాటంలో చాలా చురుకుగా పాల్గొనే వారు. ఆ ప్రభావం భగత్ సింగ్ పై పడింది. భగత్ సింగ్ తన స్కూలింగ్ ను ఆర్యసమాజ్ నడినే ఆర్యసమాజ్ నుంచి పూర్తి చేశారు.

భగత్ సింగ్ ఆరేళ్ల వయసులో నేలలో గడ్డిపరకలు నాటుతుండగా చూశారు. అప్పుడు భగత్ సింగ్ ను ఏమి నాటుతున్నావంటే, బ్రిటీషర్లను తరమడానికి తుపాకులను నాటుతున్నానని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

భగత్ సింగ్ 13వ ఏట ఉన్నప్పుడు జలియన్ వాలా భాగ్ ఉదంతం జరిగింది. భగత్ సింగ్ పై ఈ దుర్ఘటన చాలా ప్రభావం చూపింది. జలియన్ వాలా భాగ్ ఉదంతంలో కింద ఉన్న రక్తపు మట్టిని ఇంటికి తీసుకొని వచ్చి తిలకంలా దిద్దుకున్నాడు. అప్పడే బ్రిటీషర్లను తరుముతానని నిర్ణయించుకున్నాడు.

రష్యాలో జరుగుతున్న విప్లవ పోరాటాలకు భగత్ సింగ్ ఆకర్శితులయ్యాడు. లెనిన్, మార్క్స్, ఎంగిల్స్ పుస్తకాలను విస్తృతంగా చదవసాగాడు. అలా క్రమంగా సామ్యవాదం వైపు వెళ్లసాగాడు.

భగత్ సింగ్ మంచి గాయకుడు, కవిత్వం కూడా బాగా చప్పేవాడు. రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లాఖాన్లతో భగత్ సింగ్ కు మంచి పరిచయం ఏర్పడింది. హిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ లో చేరాడు. బిస్మిల్ కవితలు భగత్ ను బాగా ఉత్తేజపరిచాయి.

1925లో కాకోరీ కుట్ర కేసులో భగత్ సింగ్ కీలకంగా వ్యవహరించారు. 1927లో బిస్మిల్, అష్పకుల్లాఖాన్, రోహన్ సింగ్ లతో పాటు భగత్ బాబాయ్ ని కూడా ఉరితీశారు.

భగత్ సింగ్ కు దేవుడిపై నమ్మకం లేదు, నేను నాస్తికుడను అని ప్రకటించి వ్యాసం రాశాడు. కాన్సిట్యుయెంట్ అసెంబ్లీలో భగత్ బాంబ్ విసిరాడు, తరువాత లార్డ్ కర్జన్ ను తుపాకీతో కాల్చాడు. ఈ కేసులో భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులకు శిక్ష పడింది. 25 ఏళ్ల వయసులో భగత్ సింగ్ ను ఉరి తీశారు. ఈరోజు భగత్ సింగ్ జన్మదిన సందర్భంగా ఆయనకు ఘనమైన జోహార్లు అర్పిస్తున్నాము.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు