Bathukamma Festival Story: బతుకమ్మ పండగ ఎలా స్టార్ట్ అయింది?

Bathukamma Festival Story: తెలంగాణలో బతుకమ్మ చాలా పెద్ద పండగ. రకరకాల పూలతో అందంగా బతుకమ్మని తయారు చేసి తొమ్మిది రోజులు తెలంగాణ ఆడపడుచులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటా. అయితే బతుకమ్మ పండగ తెలంగాణలో ఎలా మొదలైంది. పెద్దలు ఈ పండగ గురించి ఏమి చెప్పారనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

bathukamma-festival

బతుకమ్మ పండగ పుట్టుక వెనక పెద్ద చరిత్రే ఉంది. క్రీ శకం 900ల సంవత్సర కాలంలో తెలంగాణని రాష్ట్రకూటములు పరిపాలించేవారు. వారికి చాళక్యులు సామంతులుగా ఉండేవారు. చోళులు, రాష్ట్రకూటములతో యుధ్దానికి దిగినప్పుడు చాళక్యులుు రాష్ట్రకూటములకు మద్దతుగా ఉండేవారు. ఆతరువాత 973లో ఛాళుక్యులు చివరి రాష్ట్రకూటమ రాజుని హతమార్చి తెలంగాణలో చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు.

ప్రస్తుతం కరీంనగర్ ప్రాంతాన్ని అప్పుడు ఛాళుక్యులు పరిపాలించారు. అందరి రాజులకు అక్కడ ఉన్న రాజరాజేశ్రీ ఆలయంపై అపారమైన భక్తి ఉండేది. చాళుక్యులు తరువాత చోళులు పరిపాలించారు. తెలంగాణ వాసులు తమ దుఖాన్ని తెలపడానికి రాజరాజేశ్వరీ ఆలయంలో ఉన్న శివలింగాన్ని పోలి ఉన్న పూల లింగాన్ని తయారు చేసి తమ బాధలకు దేవుడికి, చోళరాజుకు ఒకే సారి విన్నవించే వారు. ఇలా తెలంగాణ వాసులు అప్పటినుంచి బతుకమ్మ పండగను నిర్వహించుకుంటూ వస్తున్నారు.

తెలంగాణ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఇలా బతుకమ్మ ద్వారా రాజుకి అలాగే దేవుడికి ఒకే సారి విన్నవించడం మొదలుపెట్టారు. బతుకమ్మ పండగని తొమ్మిది రోజులు నిర్వహిస్తారు. ఒక్కోరోజు ఒక్కో బతుకమ్మను పేర్చి, బతుకమ్మ పాటలు పాడుతూ దాని ముందు ఆడతారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ పేర్లు:

  1. ఎంగిలి పూల బతుకమ్మ: మహాలయ అమావాస్య రోజు ఈ బతుకమ్మ పండగని నిర్వహిస్తారు. దీన్ని పెత్రరామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.
  2. అటుకుల బతుకమ్మ: అశ్వయుజ శుద్ద పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం సమర్పిస్తారు.
  3. ముద్దపప్పు బతుకమ్మ: ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి అందిస్తారు.
  4. నానే బియ్యం బతుకమ్మ: నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా అందిస్తారు.
  5. అట్ల బతుకమ్మ: అట్లు, దోశను నైవేద్యంగా సమర్పిస్తారు.
  6. అలిగిన బతుకమ్మ: ఆశ్వయుజ పంచమి. ఈ బతుకమ్మ రోజు నైవేద్యం సమర్పించరు.
  7. వేపకాయల బతుకమ్మ: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
  8. వెన్నముద్దల బతుకమ్మ: నువ్వులు, వెన్న, లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పిస్తారు.
  9. సద్దుల బతుకమ్మ: ఈ 9వ రోజునే దుర్గాశ్టమిని జరుపుకుంటారు. చింతపండు పులిహోర, కొబ్బరన్నం, పెరుగన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

బతుకమ్మ తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా. రకరకాల పూలతో ఉన్న అందమైన పండగ కూడా. మట్టితో దుర్గమ్మను చేసి, బతుకమ్మతో పాటు నిమజ్జనం చేస్తారు భక్తులుు.

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు