Home Lifestyle Basara Gnana Saraswathi Temple: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం

Basara Gnana Saraswathi Temple: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం

0
Basara Gnana Saraswathi Temple: బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం

Basara Gnana Saraswathi Temple: బాసర జ్ఞానసర్వతీ ఆలయం గురించి అందరికీ తెలిసిందే. ఈ ఆలయం వద్ద పిల్లలకు అక్షరాభ్యాసాన్ని చేపిస్తారు తల్లి దండ్రులు. ఆలయం వద్దే బాసర నది కూడా ఉంటుంది. కొందరు ఈ నదిలో చనిపోయిన వారి అస్థికలను కూడా సమర్పిస్తారు. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలను మనము ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

basara-temple-in-telugu

ఈ జ్ఞానసరస్వతీ ఆలయం ఆదిలాబాదు జిల్లా, ముధోల్ మండలంలోని బాసరలో ఉంది. హదరాబద్ నుంచి 200 కిమీల దూరంలో ఈ ఆలయం ఉంది. నిర్మల్ పట్టనానికి 35 కిమి.ల దూరంలో ఈ ఆలయం ఉంది. భారతదేశంలో రెండే రెండు సరస్వతీ ఆలయాలు ఉన్నాయి. ఒకటి కశ్మీర్ లో, మరొకటి బాసరలో. చాళుక్యుల కాలంలొో ఈ ఆలయాన్ని నిర్మించారు. అక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది.

జ్ఞానసరస్వతీ ఆలయ ప్రాముఖ్యం

దేశంలో ఉన్న నలుమూలల నుంచి భక్తులు తమ పిల్లలకు అక్షరాభ్యాస్యం చేయించడానికి ఈ ఆలయానికి విచ్చేస్తారు. ఇక్కడ అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుము ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రత్యేక మందిరంలో అక్కడున్న పండితుల చేత అక్షరాభ్యాసం చేయిస్తారు. అక్కడే ఉన్న జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతిలో నూనెను వంచడానికి అనేక మంది భక్తులు ఆసక్తి చూపుతారు.

మహాభారతాన్ని రాసిన వ్యాస మహర్శి కురుక్షేత్ర యుద్ధం తరువాత తన కొడుకుతో ఈ ప్రాంతానికి వచ్చాడని పురాణం చెబుతుంది. అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండడంతో, అక్కడే చిన్న కూటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అనంతరం అక్కడ చేసిన తపస్సుతో అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ముగ్గురమ్మల విగ్రహాలను ప్రతిష్టించాలని చెప్పడంతో.. వ్యసులు మట్టితో చేసిన ముగ్గురమ్మల విగ్రహాన్ని ప్రతిష్టించాడు. అప్పటి నుంచి భక్తులు ఈ ఆలయానికి పూజచేస్తూ వస్తున్నారు.

వ్యాసుడు అక్కడ నివసించడంతో వ్యాసపురి, వ్యాసర, ఆ తరువాత క్రమంగా అది బాసరగా మారిందని తెలుస్తోంది. రామాయణం రాసే ముందు వాల్మీకి ఇక్కడి ఆలయాన్ని దర్శించుకొనే రాసాడని కూడా చెబుతుంటారు. అక్కడి విగ్రహాలకు అభిషేకం చేసిన పసుపును మింగితే అనంతమైన జ్ఞాన సంపద కలుగుతుందని భక్తులు అపార విశ్వాసం.

ఇవి కూడా చూడండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here