Lingashtakam In Telugu: పరమ శివుడిని ఆరాధిస్తూ లింగాష్టక స్తోత్రాన్ని భక్తులు పఠిస్తారు. లింగాష్టకం వినని హిందువులు ఉండరు, లింగాష్టకం చదవని శివభక్తులు ఉండరు. మొత్తం 8 చరణాల్లో ఈ లింగాష్టకం ఉంటుంది. ఇందులోని ప్రతీ చరణము పరమశివుడిని స్తుతిస్తూ రాయబడి ఉంటుంది. లింగాష్టకం స్తోత్రాన్ని గొప్ప భక్తితో పఠించడం వల్ల శివలోకాన్ని చేరుతారని పెద్దల నమ్మకం.
లింగాష్టక స్తోత్రము తెలుగులో
బ్రహ్మమురారి సురార్చిత లింగం
బ్రహ్మ విష్ణు దేవతలచే పూజింపబడే లింగం
నిర్మలభాసిత శోభిత లింగం
నిర్మలమైన మాటలతో శోభించబడిన లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
జన్మ వల్ల పుట్టే దుఃఖాలను నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[1]
దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు ఋషులు పూజించే లింగం
కామదహన కరుణాకర లింగం
కామాన్ని దహనం చేసి, కరుణను చూపే చేతులుగల లింగం
రావణ దర్ప వినాశన లింగం
రావణుని గర్వాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[2]
సర్వ సుగంధ సులేపిత లింగం
అన్ని గంధాలు చక్కగా పూసిన లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
బుద్ధివికాసానికి కారణమైన లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
సిద్దులు దేవతలు రాక్షసులచే కీర్తింపబడే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[3]
కనక మహామణి భూషిత లింగం
బంగారు మహామునులచే అలంకరింపబడే లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం
నాగరాజు నివాసంచే అలంకరింపబడే లింగం
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[4]
కుంకుమ చందన లేపిత లింగం
కుంకుమ గంధము పూయబడిన లింగం
పంకజ హార సుశోభిత లింగం
కాలువల హారంచే శోభించబడే లింగం
సంచిత పాప వినాశన లింగం
సంక్రమించిన పాపాలన్నీ నాశనం చేసే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[5]
దేవగణార్చిత సేవిత లింగం
దేవగణాల చేత పూజింపబడే సేవించబడే లింగం
భావైర్భక్తిభిరేవచ లింగం
భావంచే కూడిన భక్తిచే పూజింపబడే లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
కోటి సూర్యుల కాంతిచే వెలిగిపోయే లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[6]
అష్టదళోపరివేష్టిత లింగం
ఎనమిది రకాల ఆకులపై నివసించే లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అన్నీ సరిగ్గా ఉద్బవించాడని కారణమైన లింగం
అష్టదరిద్ర వినాశన లింగం
అష్ట దారిద్య్రాలను నాశనం చేసి లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[7]
సురగురు సురవర పూజిత లింగం
దేవతల గురువు దేవతలు పూజించే లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
దేవతల తోటల్లోని పుష్పాలచే పూజింపబడే లింగం
పరాత్పరం పరమాత్మక లింగం
నీ సన్నిధియే ఒక స్వర్గం లింగమా
తత్ప్రణమామి సదాశివ లింగం
నీకు ఇవే నా ప్రణామములు సదాశివ లింగం[8]
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ
ఇవి కూడా చూడండి
- Hanuman Chalisa In Telugu: హనుమాన్ ఛాలీసా తెలుగులో
- Dwadasha Jyothirlinga Stotram: ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం
- Sri Durga Saptashati Slokam: శ్రీ దుర్గా సప్తశతి స్తోత్రం
- Mahalakshmi Stotram: మహాలక్ష్మీ స్తోత్రం, మహాలక్ష్మీ అష్టకం