Cheruvugattu Temple Brahmotsavams: చెరువుగట్టు జతర 2022 తేదీలు, బ్రహ్మోత్సవాలు

Cheruvugattu Jathara 2022 Dates: చెరువుగట్టు జాతరను తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘమాసం నిర్వహిస్తారు. ఈ 2022వ సంవత్సరంలో చెరువుగట్టు జాతరను ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 13వరకు నిర్వహించనున్నారు. నల్గొండ లోని నార్కెట్పల్లి మండలంలోని చెరువుగట్టు గ్రామంలో ఈ చెరువుగట్టు కడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రతీ ఏటీ నిర్వహిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బ్రహ్మోత్సవాలు సాఫీగా జరిగేలా ప్రత్యేక చర్యలను జాగ్రత్తలను చేపడుతుంది.

Cheruvugattu Jathara 2022 Dates

చెరువుగట్టు జాతర 2022 తేదీలు

  • ఫిబ్రవరి 8, 2022 ‌- జడల రామలింగేశ్వర స్వామి కళ్యాణం
  • ఫిబ్రవరి 9, 2022 – శేషవాహన సేవ
  • ఫిబ్రవరి 10, 2022 – అగ్నిగుండాలు
  • ఫిబ్రవరి 11, 2022 – దీపోత్సవము
  • ఫిబ్రవరి 12, 2022 – పుష్పోత్సవము
  • ఫిబ్రవరి 13, 2022 – గ్రామోత్సవము

జడలరామలింగేశ్వర స్వామి చరిత్ర

నాల్గొండలో ఉన్న జడలరామలింగేవ్వర స్వామి ఆలయాన్ని పరశురాముడు త్రేతాయుగంలో నెలకొల్పినట్లు పురాణాల్లో చెప్పబడి ఉంది. పరశురాములు భూమి చుట్టూ 21సార్లు చక్కర్లు కొట్టిన తరువాత మొత్తం భూమి పైన పవిత్రమైన 10‌8 దేవాలయాలను నెలకొప్పాడు వాటిలో చివరిగా నెలకొల్పిందే ఈ జడలరామలింగేశ్వర స్వామి ఆలయం అని పురాణం చెబుతుంది. చిన్ని శివలింగాన్ని పరుశురాముడు అప్పుడు నెలకొప్పాడంటారు. ఆ శివలింగం పెరిగిపోతూ ఉంటే పరశురాముడు దానిపైన గొడ్డలితో కొట్టాడని శివలిగంపై కొట్టిన దెబ్బ ఇప్పుడు కూడా ఉందని.. ఆ దెబ్బకు శివలింగంవ పెరిగిపోవడం ఆగిపోయిందని శాస్త్రం చెబుతుంది.

చెరువుగట్టు చుట్టు ఉండే ఆలయాలు

  • ముడుగుండ్లు
  • ఎల్లమ్మ అమ్మవారి ఆలయం
  • గోపదం
  • శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం
  • శ్రీ భైరవస్వామి ఆలయం
  • శ్రీ పార్వతి అమ్మవారి ఆలయం

ఈ ఆలయం నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో ఉంటుంది. నార్కెట్ పల్లి నుంచి 4 కిలోమిటర్ల దూరంలో ఉంటుంది. నల్లండ జిల్లా హెడ్ క్యార్టర్స్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంటుంది. నార్కెట్ పల్లి నుంచి చాలా బస్సులు ఈ ఆలయానికి వెళ్లడానికి ఉంటాయి. అమావాస్య, జాతర సమయంలో రాజీవ్ గాంధీ బస్ స్టేషన్ హైదరాబాద్ నుంచి అనేక డైరెక్ట్ బస్సులు ఉంటాయి. ఓ గుట్టపై 48 ఎకరాల్లో ఈ ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్లడానికి ప్రత్యేక ఘాట్ రోడ్ ను ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు