Medaram Jatara App: మేడారం జాతర యాప్? ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

Medaram Jathara App: మేడారం జాతర తెలంగాణలో ఎంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందో మనందరికీ తెలిసిందే. 2 ఏళ్లకి ఒకసారి వచ్చే ఈ జాతరకి కోట్ల మంది ప్రజలు హాజరవుతుంటారు. ఆధునిక సాంకేతిక యుగంలో అందరికీ మేడారం జాతరకు సంబంధించిన అన్ని విషయాలను అందుబాటులో ఉంచడానికి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతర కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్సైట్ ను యాప్ ను తయారుచేయించింది.

Medaram Jathara App

మేడారం వెబ్సైట్, యాప్

ఈ 2022 లో ములుగు జిల్లాలో మేడారం జాతర ఫిబ్రవరీ 16 నుంచి 19 వరకు జరుగనుంది. ములుగు జిల్లా కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య ఫిబ్రవరీ 2న మేడారం జాతరకు సంబంధించిన ప్రత్యేక వెబ్సైట్ www.medaramjathara.com  ఇంకా మేడారం అఫిషియల్ యాప్ లాంచ్ చేశారు. ఈ వెబ్సైట్ యాప్ ల కోసం ఇక్కడ ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేయండి.

ఈ మేడారం యాప్ లో జాతరకు సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలు ఉంటాయి. మేడారంకు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు, హెలికాప్టర్ సర్వీసులు, మేడారంలో అకామడేషన్, రూట్ మ్యాప్, స్నానపు ప్రదేశాలు, తాగునీరు, ప్రమాదకర ప్రదేశాలు, పార్కింగ్ ఎక్కడ చేయాలి, కోవిడ్ వ్యాక్సినేషన్, ఇంకా అనేక ముఖ్యమైన అవసరమైన విషయాలు ఉంటాయి.

మేడారం యాప్ ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి?

ఈ మేడారం యాప్ ను భక్తులకు ముఖ్యంగా మెడికల్ క్యాంపులకు సంబంధించిన సమాచారం, టాయిలెట్ల సమస్యలు, టూరిస్ట్ స్పాట్స్ లాంటి వాటి సమాచారాన్ని అందించడానికి రూపొందించారు. అనేక భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి చాలా ఈజీగా మీరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి medaram jathara official app ని టైప్ చేయగానే మీకు యాప్ అందుబాటులోకి వస్తుంది. లేదా ఈ మేడారం జాతన అఫిషియల్ యాప్ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.

మేడారం జాతరను ఘనంగా నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సమాయత్తమైంది. అన్ని రకాల సర్వీసులను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొంటుంది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి జరిగే మేడారం జాతరలో సుమారు 1కోటి భక్తులకు పాల్గొంటారు. సాధారణ సమయాల్లో మేడారంలో కేవలం రోజుకు 800ల భక్తులు మాత్రమే సమ్మక్క సారక్కలను దర్శనం చేసుకుంటారు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు