Medaram History In Telugu: మేడారం జాతర చరిత్ర? విశేషాలు? మేడారం జాతరను ఎప్పటి నుండి జరుపుకొంటున్నారు?

Medaram Jathara History In Telugu: తెలంగాణలో అతి పెద్ద పండగ ఏది అంటే ముందుగా వినిపించే పేరు మేడారం జాతర. ప్రతీ రెండు సంవత్సరాలకు ఈ జాతర వస్తుంది. దేశంలో కుంభమేళ తరువాత భక్తులను అంత ఎక్కువ సంఖ్యలో కలిసి పాల్గొనేది ఈ మేడారం జాతరలోనే అని అంటారు. వరంగల్ మలుగు జిల్లా, తాడ్వి మండలంలో జరిగే ఈ జాతరకు పెద్ద వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ జాతర పండుగను ప్రధానంగా గిరిజనులు జరుపుకుంటారు.

Medarama Jathara History In Telugu

13వ శతాబ్దంలో సమ్మక్క, సారక్క అనే తల్లీ బిడ్డల ప్రజలకోసం అప్పటి కాకతీయులతో పోరాడి అమరులైయ్యారు. అయితే వారు సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలను భక్తుల నమ్మకం, అందుకే సమ్మక్క సారక్కలను దర్శించుకొని పెద్ద పండగలా ఈ జాతరను జరుపుకుంటారు.

వందల ఏళ్ల చరిత్ర

మేడారం చరిత్ర విషయానికి వస్తే..1000 క్రీశతాబ్దంల మేడారం ప్రాంతంలో ఉన్న గిరిజనులు అడవివి వేటకు వెళ్తారు. అడవిలో పులులతో ఆడుకునే ఒక చిన్న పాప వారికంట కనబడుతుంది. సాక్షాత్తు దైవాంశసంభూతురాలిగా ఆ పాప తేజాన్ని ప్రకాశిస్తూ ఉండేది. గిరిజనులు ఆ పాపను అడవి నుంచి తీసుకురావడంతో వారి గిరిజనుల రాజు ఆపాపకు సమ్మక్క అని నామకరణం చేసి సొంత బిడ్డలా పెంచుకున్నారు. వయసు వచ్చిన తరువాత పగిడిద్ద రాజు అనే అక్కడి గిరిజన రాజుకు ఇచ్చి వివాహం చేశారు. ఆ కాలంలో ఆంధ్రా వరంగల్ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించే వారు. ఈ పడిగిద్ద రాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవాడు.

కాకతీయులతో యుద్ధం

కాకతీయులు పగిడిద్ద రాజును ఎక్కువ కప్పం కట్టమని డిమాండ్ చేశారు. పగిడిద్ద దాన్ని వ్యతిరేకించారు. సహించని కాకతీయులు వారితో యుద్ధానికి దిగారు ఈ యుద్ధంలో అందరూ చనిపోయారు. పగిడిద్ద రాజుకు సమ్మక్కకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉండేవాడు. వారి  పేర్ల సారక్క, నాగులమ్మ, జంపన్న. వీరందరూ కూడా కాకతీయుల చేతిలో హత్యకు గురవుతారు. జంపన్నను వాగులో పడేస్తారు. అప్పటి నుంచి ఆ వాగుకు జంపన్న వాగు అని పేరు వచ్చింది. సమ్మక్క, సారక్కలు వెనుక కత్తులు దిగబడ్డా కూడా అలానే నడుచుకుంటే ఓ గుట్టలో అదృశ్యమవుతారు. అప్పటి నుంచి వారికి దేవతలుగా భక్తుల కొలిచి ఆరాధిస్తున్నారు.

1998 లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా డిక్లేర్ చేసింది. అప్పటి నుంచి ప్రతీ రెండు ఏళ్లకు వచ్చే ఈ జాతరకు ప్రభుత్వం దగ్గరుండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు