Medaram Jatara Helicopter Booking: మేడారం జాతర హెలికాప్టర్ బుక్కింగ్ ఎలా చేసుకోవాలి? టికెట్ రేటు ఎంత?

Medara Jatara Helicopter Booking: తెలంగాణలో అతి పెద్ద పండగలా జరుపుకునే పండగ మేడారం జాతర. ఈ జాతరకు పెద్ద చరిత్రే. పేద, పెద్ద అని తేడా లేకుండా అందరూ ఈ జాతకు హాజరవుతారు. అయితే ఈ జాతరకు ప్రత్యేకంగా హెలికాప్టర్ సర్వీసులను కూడా తెలంగాణ ప్రభుత్వం 2020 నుంచి అందుబాటులోకి తీసుకుంచ్చింది. ప్రతీ రెండు సంవత్సరాలకు ఈ జాతర వస్తుంది. 2020లో అనేక మంది హెలికాప్టర్ లో మేడారం జాతరకు వెళ్లి, సమ్మక్క, సారక్కను దర్శించుకుని వచ్చారు. అయితే మేడారంకు హెలికాప్టర్ బుక్కింగ్ ఎలా చేసుకోవాలి, టికెట్ రేటు ఎంత లాంటి విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

Medara Jatara Helicopter Booking

తెలంగాణలో హెలికాప్టర్ ద్వారా మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్లాలంటే హైదరాబాద్ బేగంపేట్ ఏయిర్పోర్ట్ నుంచి హన్మకొండ నుంచి సర్వీసుల అందుబాటులో ఉన్నాయి. 2020లో టికెట్ రేట్లతో పోలిస్తే ఈ సారి కొంత ఎక్కువగా ఉంటాయి. 2020లో టికెట్ రేట్లు ఆరుగురికి 1లక్ష 80 వేల రూపాయలు ఉంది. ఈ ఒక లక్ష 80 వేల రూపాయలతో ఆరుగురు ఒకే సారి హెలికాప్టర్ లో మేడారంకు వెళ్లి తిరిగి మళ్లి రావచ్చు.

హెలికాప్టర్ సర్వీస్ రేట్లు

మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు2020 సంవత్సరం రేట్లు
హైదరాబాద్ నుంచి మేడారం ‌(ఆరుగురు మందికి)1 లక్ష 80 వేలు
హన్మకొండ నుంచి మేడారం (ఒక్కరికి)17 వేల రూపాయలు
మేడారం నుంచి మేడారం ఏరియల్ వ్యూ (ఒక్కరికి)3 వేల రూపాయలు

 

హన్మకొండు నుంచి కూడా మేడారంకు హెలికాప్టర్ సర్వీసులు ఉన్నాయి. హన్యకొండ నుంచి మేడారం కేవలం 100 కిలోమీటర్లే ఉంది కాబట్టి అక్కడి నుంచి మీకు హెలికాప్టర్ టికెట్ రేట్లు ఇంకా తక్కువగా ఉంటుంది. 2020లో హన్మకొండ నుంచి మేడారంకు ఒక్కరికి 17వేల రూపాయలు ఉంది. ఈ టికెట్ లో మిమ్మల్ని హన్మకొండ నుంచి మేడారంకు తీసుకువెళ్తారు. అక్కడ దేవాలయంలో వీఐపీ దర్శనం చేపిస్తారు. మళ్లీ మేడారం నుంచి హన్మకొండకు వదిలేస్తారు.

తక్కువ రేటుతో హెలికాప్టర్ సర్వీస్

మేడారం నుంచి మేడారం కు కూడా హెలికాప్టర్ సర్వీసులు ఉంటాయి. 2020లో ఒక్కరికి సుమారు 3వేల వరకు చార్జ్ చేశారు. మేడారంలోని అద్భతమైన ప్రదేశాలను ఏరియల్ వ్యూలో హెలికాప్టర్ నుంచి చూడవచ్చు.

పై అన్ని సర్వేసుల్లో రెండు సంవత్సరాలకంటే చిన్న వయసు ఉన్నవారు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రెండు సంవత్సరాలు నిండకపోతే వారికి ప్రత్యేక టికెట్ తీసుకోవలసిన అవసరం లేదు.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు