History Of Charminar: హైదరాబాద్ లోని చార్మినార్ చరిత్ర, కట్టడం వివరాలు, సమయం

History Of Charminar: చార్మినార్ లేనిదే హైదరాబాద్ ను ఊహించుకోలేము. హైదరాబాద్ లో అద్భుతమైన కట్టడం చార్మినార్, దీన్ని 1591లో అప్పటి నవాబ్ కులీ కుతుబ్ షా దీన్ని నిర్మించారు. చార్ మినార్ అనే దాంట్లో రెండు పదాల అర్ధాలున్నాయి. చార్ అంటే నాలుగు, మినార్ అంటే టవర్. చార్ మినార్ అంటే నాలుగు టవర్లని అర్ధం వస్తంది. ఈ చార్మినార్ గురించిన మరిన్న విశేషాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

history of charminar

చార్మినార్ లో ఉండే ఒక్కో మినార్ అంటే ఒక్కో టవర్ సుమారు 50 మీటర్ల పొడవు ఉంటుంది. ఒక్కో మినార్ లో వృత్తాకరంలో 150 వరకు మెట్లు ఉంటాయి. 1889లో చార్మినార్ లోకి ఓ గడియారాన్ని చేర్చారు. ఆగ్రాకు తాజ్ మహల్ లా, పారిస్ కు ఈఫిల్ టవర్ ఉన్నట్లే హైదరాబాద్ కు తాజ్ మహల్ ఉంది.

కొద్ది దూరంలోనే మక్కా 

చర్మినార్ కు నైరుతి దిశలో రెండు వందల గజాల్లో మక్కా మసీదు ఉంది. దీనికి కేంద్ర వంపును నిర్మించడానికి ఇటుకలను మక్కా నుంచి తీసుకువచ్చారని చెబుతారు. చార్మినార్ సాయంత్రం సమయంలో మెరుస్తుంది. చార్మినార్ పైనుంచి హైదరాబాద్ అందమైన దృశ్యాలను చూడవచ్చు. చార్మినార్ మొత్తం హైదరాబాద్ కు ఒక స్మారక చిహ్నం అని చెప్పుకోవచ్చు.

భార్యప్రేమకు గుర్తుగా

కులీకుతుబ్ షా తన భార్య భాగమతి గౌరవార్థం ఈ చార్మినార్ ను నిర్మించారని కూడా అంటారు. 1591లో ఘోరమైన అంటువ్యాధి వ్యాపించింది, ఈ అంటువ్యాధి తగ్గిన తరువాత దేవుడు అల్లాహ్ కు నివాళిగా చార్మినార్ ను నిర్మించారని కూడా చెబుతారు. ఇలా ఎన్నో కథలు చార్మినార్ నిర్మాణం చుట్టూ అల్లుకొని ఉన్నాయి.

అప్పట్లో రూ. 9లక్షల ఖర్చు

1589లో చార్మినార్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అప్పుడు దీనికి అయిన ఖర్చు రూ.9లక్షలు, ఆ కాలంలో 2 లక్ష బంగారు నాణేలు. 30 అడుగుల పునాదితోఈ మినార్ లను నిర్మించారు. 1670లో మెరుపు వల్ల ఓ మినార్ కింద పడిపోయింది. మళ్లీ దాన్ని తిరిగి నిర్మించారు.

గోల్కొండ్ నుంచి చార్మినార్ కింది వరకు ఓ రహస్య మార్గం కూడా ఉందని చెబుతారు. రాజ కుటుంబం తప్పించుకోవడానికే ఈ రహస్య మార్గం నిర్మించారని చెబుతారు. మీరు ఇంతవరకు చార్మినార్ ను చూడకపోయి వుంటే వెంటనే చూసెయ్యండి.

  • చార్మినార్ కు సంబంధించిన ఫోన్ నంబర్ – 914023522990
  • చార్మినార్ ఓపెనింగ్ టైమ్స్ – ఉదయం 9.30 నుంచి 5.30 వరకు

ఇవి కూడ చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు