TS Challan Payment: తెలంగాణ పోలీస్ చాలాన్లను ఎలా పే చేయాలి?

TS Challan Payment: ట్రాఫిక్ లో మనము బైక్ నడుపుతున్నప్పుడో లేక కార్ నడుపుతున్నప్పుడో రూల్స్ అతిక్రమిస్తే చలాన్లు పడతాయి. చలాన్ పడ్డట్టు వెంటనే మన మొబైల్ కు మెసేజ్ వస్తుంది. అయితే అందరికీ ఈ మెసేజ్ రాకపోవచ్చు. బండి రిజిస్ట్రేషన్ సమయంలో మీరు మీ ఫోన్ నంబర్ ను జత చేయకపోతే మెసేజ్ వచ్చే అవకాశాలు తక్కువ. అయితే చలాన్ పడగానే ఏమి చేయాలి, ఎక్కడ పేమెంట్ చేయాలా లాంటి వివరాలను ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తున్నాము.

ts-traffic-challan-online-check-pay-your-telangana-e-challan-online-payment

చాలాన్ వివరాలను ఇలా తెలుసుకోవాలి

 • గూగుల్ లో TS E Challan అని టైప్ చేయండి లేదా ఈ లింక్ పై క్లిక్ చేయండి టీఎస్ ఈ చలాన్ వెబ్ సైట్
 • టీఎస్ ఈ చలాన్ అధికారిక వెబ్సైట్ కు వెళ్లిన తరువాత వెహికల్ నంబర్ కాలమ్ లో మీ బండి నంబర్ టైప్ చేయండి
 • బండి నంబర్ టైప్ చేసిన తరువత క్యాప్చా అడుగుతుంది, దాన్ని టైప్ చేయండి, తరువాత ఎంటర్ ప్రెస్ చేయండి
 • మీ బండి పై ఎన్ని చలాన్లు ఉన్నాయో ఫోటోలతో సహా పూర్తి వివరాలు అదే పేజీపై కింద ప్రెజెంట్ అవుతాయి.
 • మొత్తం మీకు ఎంత చాలన్ వచ్చిందో చూసుకొని పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఎంత అమైంట్ పే చేయాలనుకుంటున్నారో ఎంటర్ చేసి పే చేయండి.

తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు విధించే చలాన్లు

 • డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే – 5వేలు
 • సీట్ బెల్ట్ లేకపోతే – 1వెయ్యి
 • హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కు – 3నెలల శిక్ష+ వెయ్యి
 • డ్రంక్ ఆండ్ డ్రైవ్ – 15వేలు + ఆరు నెలల జైలు శిక్ష
 • రోడ్ బ్రేకింగ్ రూల్స్ – 1వెయ్యి
 • అనధికార వాహనాలు నడిపితే – 5వేలు
 • తప్పుడు లైసెన్స్ తో డ్రైవింగ్ చేస్తే – 10వేలు
 • ఓవర్ స్పీడ్ – 2వేలు
 • హెల్మెట్ లేకపోతే – 1వెయ్యి
 • బాల్య నేరాలకు 25వేలు – 3 సంవత్సరాల జైలు శిక్ష

ఇవి కూడ చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు