Dr. BR Ambedkar Biography: భారత స్వాతంత్ర్య పోరాట కాలంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా, ఆర్ధికవేత్తగా, న్యాయ శాఖ మంత్రిగా, రాజకీయ నాయకుడిగా, ఇలా ఎన్నో బాధ్యతలను ఆయను నిర్వర్తించారు. డా. అంబేద్కర్ జననం, విద్య, కాలేజ్, యూనివర్సిటీ, కెరీర్, పోరాటం, ఉద్యోగం, వ్యక్తిగత జీవితం గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
విద్య బాల్యం
డా. బీఆర్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మద్యప్రదేశలోని మౌ గ్రామంలో తండ్రి రామ్ జీ మాలో జీ సత్పాల్, తల్లి సీమాబాయి కి 14వ బిడ్డగా జన్మించాడు. అంబేద్కర్ దళిత కులానికి చెందడంతో చిన్నప్పటి నుండే కులవ్యవస్థ అకృత్య రూపాన్ని చూశారు. అంబేద్కర్ తండ్రి రామ్జీ బ్రిటీష్ సైన్యంలోని మౌ కంటోన్మెంట్ లో సైనికుడిగా బాధ్యతలు చేపట్టేవారు.
దళితుడు కావడంచేత అంబేద్కర్ కు పాఠశాలలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. క్లాస్ కు వెళ్లినా తరగతి బయటే కూర్చోబెట్టేవారు. దాహం వేస్తే పాఠశాల ప్యూన్ దూరం నుండి నీరు పోసేవారు. అంబేద్కర్ స్కూలింగ్ కాలేజీ విద్య మంచి మార్కులతో పూర్తి చేయడంతో అప్పటి బరోడా రాజు గాయిగ్వార్ అంబేద్కర్ కు చదవడానికి స్కాలర్షిప్ ను అందించారు. ఈ స్కాలర్షిప్ తో అంబేద్కర్ అమెరికా, బ్రిటెన్, జెర్మనీలో చదువుకున్నారు.
పోరాటం
కులవ్యవస్థపై అంబేద్కర్ చాలా పోరాటం చేశారు. బావిలో నీళ్లు తాగడానికి అప్పుడు దళితులకు హక్కు ఉండేది కాదు. అంబేద్కర్ ప్రజలతో వెళ్లి నేరుగా పోరాటం చేసి నీరు తాగే హక్కు మాకు కూడా ఉందని పోరాడేవారు. మహాత్మాగాంధీకి అంబేద్కర్ కు కులం విషయంలో కొంత విభేదాలు ఉండేవి. గాంధీ కులవ్యవస్థను సమర్ధిస్తున్నారని, కాంగ్రెస్ గాంధీ అంటరాని వాళ్ల కోసం ఏమి చేసిందని ఎన్నో వ్యాసాలు రాసేవార.
కీలక బాధ్యతలు
1947 భారత దేశ మొదటి న్యాయవాద శాఖ మంత్రిగా నియమితులయ్యారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ కీలకపాత్రను పోషించారు. అయితే ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ లోనే ఆయనకు కొందరు వ్యతిరేకంగా పనిచేసేవారు, దీనికి నిరసనగా అంబేద్కర్ న్యాయవాద్ శాఖకు 1951లో రిజైన్ చేశారు.
చిన్న వయసు నుంచే అంబేద్కర్ కు బౌద్ధంపై ఆసక్తి ఎక్కువ. అందుకే 1956, ఆక్టోబర్ 14న అంబేద్కర్ హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించారు. అంబేద్కర్ బౌద్దం స్వీకరించేటప్పుడు వారితో మరో 2లక్షల మంది బౌద్ధాన్ని స్వీకరించారు. బౌధ్దం ప్రాముఖ్యాన్ని చెబుతూ అంబేద్కర్ “The Buddha and His Dhamma” అనే పుస్తకాన్ని కూడా రచించారు. డిసెంబర్ 6, 1956న అంబేద్కర్ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
ఇవి కూడా చూడండి