Medaram Buses From Hyderabad: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మేడారం జాతరకు ప్రభుత్వం సుమారు 4 వేలు ఆర్టీసీ బస్సుల సర్వీసులను ప్రారంభించింది. ఈ 4వేల బస్సులు కేవలం మేడారం జాతరకు తీసుకువెళ్లి తిరిగి డ్రాప్ చేయడానికి మాత్రమే వినియోగించేలా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తులు ఈ ఆర్టీసీ సేవల వివరాలు, ఏ బస్సు ఏ జిల్లా నుంచి ఎప్పుడు స్టార్ట్ కానుందనే వివరాలు, బుక్కింగ్స్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ TSRTC Medaram Jathara అఫిషియల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
మేడారం జాతర ఫిబ్రవరీ 16 నుంచి ఫిబ్రవరీ 19 వరకు జరుగనుంది. కోటికి పైగా ప్రజలు ఈ జాతరకు విచ్చేసి సమ్మక్క సారక్కలను దర్శించుకోనున్నారు. ఈ 2022వ సంవత్సరంలో జరిగే మేడారం జాతరకు 25 లక్షల మంది భక్తులు టీఎస్ఆర్టీసీ సర్వీసులు వినియోగించుకోనున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ విసి సజ్జనార్ తెలిపారు. మేడారంలో బస్సుల కోసం 50 ఎకారాల ఓపెన్ బస్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ బస్ స్టేషన్లో 42 క్యూలైన్లు, 300 వాలంటీర్లు పనిచేయనున్నారు. ఈ వాలంటీర్లు మేడారంకు బస్సులకు సంబంధించిన అన్ని విషయాలను గైడ్ చేస్తారు.
మేడారం బస్సు సర్వీసుల కోసం Medaram Jathara Guide Official App ఈ యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను మేడారం జాతరకు సంబంధించి తెలంగాణ ప్రభుత్యం ప్రత్యేకంగా రూపొందించింది. మేడారంలో ఆర్టీసీ సేవలను పూర్తి స్థాయిలో టీఎస్ఆర్టీసీ స్టాఫ్ మొత్తం సమాయత్తమైందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
టీఎస్ఆర్టీసీ మేడారం అఫిషియల్ యాప్ ను వరంగల్ కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్స్ విద్యార్ధులు రూపొందించారు. ఈ యాప్ ద్వారా భక్తులు చాలా ఈజీగా, సులువుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ యాప్ లో బస్ రూట్ నంబర్లు, హెల్ప్ డెస్క్ నంబర్లు, గైడ్ ల నంబర్లు అన్నీ ఉంటాయి. మేడారం అఫిషియల్ యాప్ ను మేడారం జాతర అధికారిక వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇవి కూడా చూడండి
- Medaram Jatara App: మేడారం జాతర యాప్? ఎక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
- Medaram Jatara Helicopter Booking: మేడారం జాతర హెలికాప్టర్ బుక్కింగ్ ఎలా చేసుకోవాలి? టికెట్ రేటు ఎంత?
- Lingashtakam In Telugu: తెలుగులో లింగాష్టక స్తోత్రము
- Hanuman Chalisa In Telugu: హనుమాన్ ఛాలీసా తెలుగులో