Egg Benefits For Hair: కొడిగుడ్లతో జుట్టుకు కలిగే ప్రయోజనాలు, టిప్స్

Egg Benefits For Hair: కోడి గుడ్డును పగలగొట్టి జుట్టుకు రాసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డు జుట్టును బలంగా ఉంచడమే కాకుండా, ప్రకాశవంతంగా అందంతా, ఒత్తుగా మార్చుతుంది. హోలీ పండగ వేలలో కొందరు గుడ్డుని తలపై కొడతారు. ఆతరువాత జుట్టును వాష్ చేసిన తర్వాత జుట్టు మెరుస్తు, సిల్కీగా అందంగా ఉంటుంది. గుడ్డులో బికాంప్లెక్స్ విటమిన్లు, బయోటిస్, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మీ జుట్టును బలంగా, ఒత్తుగా చేస్తయి. గుడ్లతో జుట్టుకు కలిగే మరిన్ని విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం

egg-benefits-for-hair-in-telugu
Source: femina.wwmindia.com

గుడ్డు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది

జుట్టుకు 70 శాతం ప్రొటీన్ అవసరం పడుతుంది. గుడ్డులో ఈ ప్రొటీన్ ఉంటుంది. జుట్టులో దెబ్బతిన్న కెరాటిన్ ను ఇది నయంచేసి జుట్టు రాలకుండా చేస్తుంది.

గుడ్డలో ఏ భాగం జుట్టుకు మంచిది?

జిడ్డు జుట్టు ఉన్నవారికి తెల్ల సొన మంచిది. పొడి జుట్టు ఉన్న వారికి పచ్చ సొన మంచిది. అయితే ఎక్కువ శాతం తెల్ల సొననే జుట్టుకు కలిపే మిశ్రమాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. గుడ్డులో ఉన్న తెల్ల సొనలో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నియాసిన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలు ఉంటాయి.

పచ్చసొనలో తెల్లసొనకంటే కొంత తక్కువ ప్రొటీన్స్ ఉంటాయి. పచ్చసొనలో బికాంప్లెక్స్ విటమిన్స్, ఫోలిక్ ఆమ్లం ఉంటాయి. పొడి జుట్టు ఉన్నవారు ఈ పచ్చసొననే అంటించాలి, ఎందుకంటే ఇది జుట్టును బాగా కండీషన్ చేస్తుంది. తెల్ల సొన, పచ్చసొన కలిపి ఉన్న మొత్తం గుడ్డుని జుట్టుకు అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు ఒత్తుగా పెరగడానికి చిట్కా

  • 2 గుడ్లు
  • 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్

తయారీ విధానం: ఒక గిన్నెలో గుడ్లని పగలకొట్టి అందులో ఆలివ్ ఆయిల్ ను వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రామన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. 20 నిమిశాలు దాన్ని అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీళ్లతో జుట్టును కడగి స్నానం చేసుకోవాలి. వేడి నీటితో జుట్టును కడిగితే గుడ్ల వాసన మరింత పెరుగుతుంది.

జుట్టు పెరుగుదలకు చిట్కా

  • 2 గుడ్లు
  • 1 టీస్పూన్ కాస్టర్ ఆయిల్ (ఆముదం నూనె)

రెండు గుడ్లను గిన్నలో పగలకొట్టి బాగా కలపాలి. 1 చెంచా ఆముదం నూనెను అందులో వేసి ఆ మిశ్రమాన్ని జుట్టుకు ప్యాక్ లా చేసుకోవాలి. 20 నిమిశాల వరకు జుట్టును అలాగే వదిలేయాలి. ఆ తరువాత చల్లటి నిళ్లతో జుట్టుకు కడిగి స్నానం చేసుకోవాలి.

ఆరోగ్యమైన జుట్టు కోసం మెహందీ చిట్కా

  • 2 చెంచాల మెంతి గింజలు
  • 1 కప్పు మెహందీ పౌడర్
  • గుడ్డు పచ్చసొన

తయారీ విధానం: రాత్రి నానబెట్టిన మెంతి గింజలను ఉదయం గోరింటాకు పొడిలో వేసుకొని బాగా రుబ్బుకోవాలి. దాంట్లో గుడ్డు పచ్చసొన కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని జుట్టుకు ప్యాక్ లా అంటించాలి. ఒక గంట తరువాత జుట్టును చల్లటి నీటితో కడిగివేసి స్నానం చేసుకోవాలి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు