Tips For Oily Skin: చర్మంపై జిడ్డు తగ్గించే చిట్కాలు

Tips To Reduce Oily Skin: మహిళల్లో అనేక మంది జిడ్డు చర్మంతో సతమతమవుతుంటారు. చర్మం జిడ్డుగా ఉండడం వల్ల మొటిమలు కూడా క్రమంగా పెరగడం ప్రారంభం అవుతాయి. ఆయుర్వేదంలో దీనికి కోసం అనేక రకాలైన చిట్కాలను ఉన్నాయి. ఇప్పటికే శెనగ పిండి ఫేస్ ప్యాక్ ను చాలా మంది ఫాలో అవుతారు. ఇంకా మరిన్ని చిట్కాలని ఈ ఆర్టికల్ లో మీకు అందిస్తాము.

oily skin telugu
Source: www.nykaa.com

జిడ్డు చర్మాన్ని తగ్గించే చిట్కాలు

  • బయట నుంచి రాగానే ముఖాన్ని ఫేస్ వాష్ తో శుబ్రం చేసుకోవాలి
  • నూనె పదార్ధాలు తినడం ఆపేస్తే మంచి ఫలితం ఉంటుంది
  • రోజు వ్యాయామం చేస్తే చమట వల్ల జిడ్డు తగ్గే అవకాశం ఉంది. ప్రాణాయామం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది
  • బటకి వెళ్లినప్పుడు ముఖాన్ని స్కార్ఫ్ తో కప్పివేయండి, దీంతో దుమ్ము పడకుండా, సుర్యకాంతి పడకుండా ఉంటుంది.
  • ముఖాన్ని రోజుకు 3 నుంచి 4 సార్లు కడగాలి. ఫేస్ వాష్ ఎక్కువగా ఉపయోగిస్తే జిడ్డు పెరుగుతుంది. కాబట్టి మంచి నీటితోనే ఎక్కువగా వాష్ చేసుకోవాలి
  • మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి

ఆయిలీ స్కిన్ తగ్గాలంటే ఏమి తినాలి?

దోసకాయ, నారింజ, బ్రోకలీ, ఆకుపచ్చ కూరగాయలు, కొబ్బరి నీరు, నిమ్మకాయ, అరటి, పప్పులు తినాలి. నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను, పండ్లను తీసుకుంటే చాలా మంచిది.

ఏమి తినవద్దు?

జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి. వేయించిన చిప్స్, ఎర్ర మాంసం, పాల ఉత్పత్తులు, వెన్న, క్రీమ్, జున్ను, చక్కెర పానియాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బజ్జీలు, ఫ్రయిడ్ ఫుడ్ తినకూడదు.

రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్

  • కొద్దిగా రోజ్ వాటర్
  • కాటన్

చిన్న జగ్ లో కొంత రోజ్ వాటర్ ను తీసుకొని అందులో కాటన్ ని ముంచి ఆ కాటన్ తో ఫేస్ ను శుబ్రం చేసుకోవాలి. అలా రోజు పడుకునే ముందు చేయాలి. వెంటనే దాన్ని కడిగివేయకుండా ఉదయం శుబ్రం చేసుకోవాలి.

ఇలా రోజ్ వాటర్ తో ప్యాక్ చేయడం వల్ల రోజ్ వాటర్ లో ఉండే యాంటీమైక్కోబయాల్స్, యాంటీఆక్సిడెండ్లు, విటమిన్లు, ఖనిజాలు చర్మానికి అంది మంచి ఫలితం ఇస్తుంది.

ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్

  • 2 టీస్పూన్ల ముల్తానీ మిట్టి
  • ఒక చెంచా పెరుగు
  • 2 చుక్కల నిమ్మ రసం

ముఖాన్ని ముందు మంచి నీటితో కడగాలి. ముల్తాని మిట్టి, పెరుగు, నిమ్మరసం బాగా కలపాలి. ఆ మిశ్రామాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ గా వేసుకోవాలి. అర గంట తరువాత మంచి నీటితో దాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖం తుడుచుకున్న తరువాత మాయిశ్చరైజర్ క్రీమ్ రాసుకోవాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.

వేప ఫేస్ ప్యాక్

  • 10 వేప ఆకులు
  • 4 చిటికెడు పసుపు

వేపఆకులను నీటిలో నానబెట్టాలు. అనంతరం దాన్ని రుబ్బి అందులో పసుపు వేసుకొని పేస్ట్ గా తయీరు చేసుకోవాలి. పేస్ట్ పలుచగా కావాలంటే కొంత నీరు కలపుకోవచ్చు. ఆ మిశ్రమాన్ని ముఖంపై ఫేస్ ప్యాక్ చేసుకొని, 20 నిమిశాల తరువాత శుభ్రం చేసుకోవాలి.

తేనె ప్యాక్

  • 10 బాదాం పప్పులు
  • 1 చెంచా తేనె

పది బాదాం గింజలను రాత్రి నీటిలో నానబెట్టాలి. ఉదయం బాగా రుబ్బుకోవాలి అందులో 1 చెంచా తేనె కూడా కలిపి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖ్యం పై ప్యాక్ చేసుకొని 15 నిమిశాల తరువాత కడుగేసుకోవాలి. తేనె బాదాంలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయాల్స్, ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతాయి.

ఇవి కూడా చూడండి

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు