Batch Movie Review: బ్యాచ్ మూవీ రివ్యూ

Batch Movie Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్యాచ్ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో గ్రాండ్ గా ఈ రోజు.. అంటే ఫిబ్రవరీ 18న రిలీజ్ అయింది. ఊహించినట్లుగానే తొలిరోజే ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. రఘు కుంచె మ్యూజిక్, నేహ పథాన్ పర్ఫామెన్స్ మూవీకి హైలైట్ గా నిలిచాయి. శివ ఈ మూవీకి దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే దీనికి కథ రచనను చేశారు.

Batch Movie Review

బ్యాచ్ మూవీ స్టోరీ, తారాగణం

యూత్ రొమాంటిక్ కామెడీ జానర్ తో అనేక సినిమాలు వచ్చాయి. వాటిలో ఈ బ్యాచ్ కూడా ఒకటని చెప్పుకోవచ్చు. నలుగురు ఆకతాయిలకు నలుగురు గర్లఫ్రెండ్స్ ఉంటారు. వీళ్లంతా కలిసి బ్యాచ్ గా ఎంటర్టైన్ అవుతున్న సమయంలో అనుకోకుండా ఓ సంఘటన మొత్తం కథను మలుపు తిప్పుతుంది. ఏంటా కథ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

రఘు కుంచె ఈ మూవీకి సంగీతాన్ని అందిచండం హైలైట్ అని చెప్పుకోవచ్చు. శిశ ఈ సినిమాకు కథతో పాటు దర్శకత్వాన్ని కూడా వహించారు. ఇక సాత్విక్ వర్మ, నేహ పథాన్ ప్రధాన పాత్రలో నటించారు. చాంద్ని బతీజా, పవన్, వినోద్ కుమార్, బాహుబలి ప్రభాకర్, చిన్న ప్రధాన పాత్రలో నటించారు. రమేశ్ గనమజ్జి ఈ మూవీని ఆకాంక్ష మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. వెంకట్ మన్నం సినిమాటోగ్రఫీని హ్యండిల్ చేయగా, జెపి ఎడిటింగ్ ని హ్యాండిల్ చేశారు.

మూవీ పేరుబ్యాచ్
దర్శకత్వంశివ
నటీనటులుసాత్విక్ వర్మ, నేహ పథాన్, చాంద్ని భతిజ, పవన్, వినోద్ నాయక్, సుభాశ్, శ్రీ మాధురి, గీతిక, వినోద్ కుమార్, బాహుబలి ప్రభాకర్, చిన్న
సంగీతంరఘు కుంచె
సినిమాటోగ్రఫీవెంకట్ మన్నం
ఎడిటింగ్జెపి
నిర్మాతరమేశ్ గనమజ్జి
ప్రొడక్షన్ బ్యానర్ఆకాంక్ష మూవీ మేకర్స్

సినిమా ఎలా ఉందంటే?

బ్యాచ్ సినిమా.. కంప్లీట్ గా ఓ యూత్ ఎంటర్టైనర్ చిత్రం అని చెప్పుకోవచ్చు. కథ, కాన్సెప్ట్ పాతదే అయినప్పటికీ డైరక్టర్ కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించారు. రఘు కుంచె మ్యూజిక్, నేహ పథాన్ యాక్టింగ బాగుంది. ఈ వారం రిలీజ్ అయిన మంచి సినిమాల్లో ఒకటిగా ఈ బ్యాచ్ సినిమా అని చెప్పుకోవచ్చు.

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు