Vishwak Movie Review: విశ్వక్ మూవీ రివ్యూ

Vishwak Movie Review: అజయ్ కథుల్వార్ మరియు డింపుల్ ప్రధాన పాత్రల్లో నటించిన విశ్వక్ సినిమా, ఈ రోజు ఫిబ్రవరి 18, 2022న థియేటర్లలో విడుదలైంది. ఈ శుక్రవారం చాలా చిన్న సినిమాు విడుదలయ్యాయి దాంట్లో విశ్వక్ ఒకటి.

Vishwak Movie Review

సాధారణంగా, చిన్న చిత్రాలకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి చాలా ప్రమోషన్లు అవసరం, లేకపోతే థియేటర్లో సినిమా నిలబడదు, విశ్వక్ ట్రైలర్ చాలా మంది దృష్టిని ఆకర్శించింది, అదే పెద్ద ప్రయోహం అయింది.విశ్వక్ సినిమాకు కథ, డైలాగ్స్ బాగా వర్కవుట్ అయ్యాయని టాక్ వచ్చింది. మరి ఈ చిన్న సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ

విశ్వక్ సినిమా ఒక కొత్త కథతో ప్రజలముందుకు వచ్చింది. ఇందులో విశ్వక్ తన తండ్రి 25 లక్షలు ఇచ్చి ఫారన్ పంపుతానని చెప్పినా వినడు. ఇక్కడే వ్యాపారం చేస్తా అంటాడు. కానీ తన చుట్టూ ఉన్న చాలా మందే భారత్ ను వీడి స్థిరపడాలనుకుంటారు. ఇది చూసి విశ్వక్ అందరినీ నిలదీస్తాడు. అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. విశ్వక్ చెప్పే డైలాగ్స్ చాలా బాగుంటాయి. 

విశ్వక్ మూవీ యొక్క తారాగణం & సిబ్బంది

వేణు ముక్కాల దీనికి దర్శకత్వం వహించారు. అజయ్ కతుర్వార్, డింపుల్ ప్రధాన పాత్రలు పోషించారు. తాటికొండ ఆనందం బాల క్రిష్ణ దీనిని ప్రొడ్యూస్ చేశారు. సత్య సాగర్ పోలం సంగీతాన్ని సమకూర్చగా, ప్రదీప్ దేవ్ సినిమాటోగ్రఫీని హ్యాండిల్ చేశారు.

సినిమా పేరువిశ్వక్
నటీనటులుఅజయ్ కతుర్వర్, డింపుల్
దర్శకులువేణు ముల్క
నిర్మాతతాటికొండ ఆనందం బాల క్రిష్ణ
సంగీతంసత్య సాగర్ పొలం
సినిమాటోగ్రఫీప్రదీప్ దేవ్

సినిమా తీర్పు

భారత దేశంలో ప్రస్తుతం ఎన్నారై అమెరికాలో స్థిరపడిపోవడం, నిరుద్యోగం లాంటి సమస్యలను డైరెక్టర్ ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇప్పుడు చాలా మంది తల్లి దండ్రలు తమ పిల్లలను అమెరికాకు పంపించేస్తున్నారు. భారత్ ఎదుర్కొంటున్నా ఈ సమస్యలపై విశ్వక్ సినిమా మంచి మెసేజ్ ఇచ్చింది.

సినిమా రేటింగ్: 3/5

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు