Gamanam Movie Review: గమనం మూవీ రివ్యూ

Gamanam Movie Review: కొత్త కథతో తెరకెక్కించిన సినిమా గమనం. 5 భాషల్లో నూతన డైరెక్టర్ సుజనా రావు దీనిని విడుదల చేశారు. కొన్ని కథల చుట్టూ ఉండే ఈ మొత్తం సినిమా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. శ్రియ శరన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, సుహాస్, నిత్యా మీనన్, యాంకర్ బిత్తిరి సత్తి ఈ గమనంలో అద్భుతంగా నటించారు.

గమనం మూవీ రివ్యూ (Gamanam Movie Review)

Gamanam Movie Review: గమనం మూవీ రివ్యూ

డెబ్యూట్ డైరెక్టర్ సుజనా రావు ఈ గమనానికి కథ అందించడంతో పాటు ఆయనే దీనికి దర్శకత్వం వహించారు. శ్రియ శరన్, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, సుహాస్, బిత్తిరి సత్తి, రవి ప్రకాష్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. రమేష్ కరుటూరి, వెంకీ పుషాడపు, జ్ఞానశేఖర్ వీఎస్ కలిసి ఈ మూవీ ని క్రియ ఫిలిం కార్పొరేషన్ కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మించారు. ఇండియన్ మ్యూసికల్ మాస్ట్రో ఇళయరాజా సంగీతాన్ని అందించగా, జ్ఞానశేఖర్ కెమెరా మెన్ గా వర్క్ చేశారు.

కొత్త కథతో మనముందుకు వచ్చిన ఈ గమనం మూవీ.. అందరి హృదయాల్ని టచ్ చేస్తుంది. సాధారణమైన అంశాలోతో డైరెక్టర్ సుజనా రావు చాలా అద్భుతంగా తీశారు. నేషనల్ క్రికెట్ ప్లేయర్ అవ్వాలనుకునే అలీ (శివకందుకూరి), పసిపిల్లాడి తో ఒక చెవిటి తల్లి ఎలా ఒంటరిగా మారుతుంది, ఇద్దరు మురికివాడలోని పిల్లలు, పుట్టిన రోజు జరుపుకోవడానికి ఎంత ఆరాటపడతారు.. ఇలా సాగే ఈ మూడు కథలు చివరికి ఏ మలుపు తీసుకుంటాయనేదే గమనం స్టోరీ.

“గమనం” ఒక పాన్ ఇండియా సినిమా. తెలుగుతో పాటు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయింది. కమల్ హాసన్ సోదరుడు చారు హాసన్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు. మొత్తంగా గమనం ఒక మంచి ఫామిలీ ఎంటర్టైనర్ సినిమా. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ లతో చాలా అరుదుగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఆలస్యం చేయకుండా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాని చూసెయ్యండి.

మూవీ రేటింగ్ : 3.5/5

ఇవి కూడా చూడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు