Sammathame Movie Review: సమ్మతమే మూవీ రివ్యూ

Sammathame Movie Review: కిరణ్ అబ్బవరం రాజా వారు రాణి వారు, SP కళ్యాణ మండపం, మరియు సెబాస్టియన్ వంటి బ్యాక్-టు-బ్యాక్ చిత్రాలతో పాపులర్ అయ్యాడు, ఇప్పుడు అతను సమ్మతమే అనే ఫ్యామిలీ డ్రామా చిత్రంతో మన ముందుకు వచ్చాడు, టీజర్ మరియు ట్రైలర్ కొత్తగా మరియు ఫ్రెష్ గా ఉండడం వాళ్ళ ఈ చిత్రానికి మంచి అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఈ ఫ్యామిలీ డ్రామా ఈరోజు జూన్ 24, 2022న విడుదలైంది మరియు దీనికి సానుకూల స్పందన వస్తోంది, సినిమా చూడదగ్గదేనా కాదా అని ఈ రివ్యూ లొ తెలుసుకుందాం.

Sammathame Movie Review

కథ

కృష్ణ (కిరణ్ అబ్బవరం) ఒక మధ్యతరగతి కుర్రాడు, అతను చిన్నతనంలో అతని తల్లి చనిపోవడం వల్ల, ఆడవారు తనను చూసుకుంటే ఇల్లు బాగుంటుందని నమ్ముతాడు మరియు తాను చాలా అడ్డంకులు ఎదుర్కుంటాడు అయితే కృష్ణ వీలైనంత త్వరగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను తనకి పూర్తి వ్యతిరేకమైన సాన్వి(చాందిని చౌదరి)ని కలుస్తాడు, చివరికి ఇద్దరూ ప్రేమలో పడతారు , కానీ సంబంధంలో సమస్య తలెత్తుతుంది, కృష్ణ అతి ప్రేమని సాన్వికి ఇష్టం లేకపోవడంతో కృష్ణపై శ్రద్ధ తగ్గిపోతుంది దింతో గొడవలు మొదలవుతాయి , చివరకు కృష్ణ శాన్వి ని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మీరు మూవీ చూసి తెల్సుకోవాలి.

సమ్మతమే మూవీ నటీనటులు

కిరణ్ అబ్బవరం, మరియు చాందిని చౌదరి, మరియు చిత్రానికి దర్శకత్వం: గోపీనాథ్ రెడ్డి, ఛాయాగ్రహణం: సతీష్ రెడ్డి మాసం, సంగీతం: శేఖర్ చంద్ర, చిత్రానికి కంకణాల ప్రవీణ నిర్మించారు.

సినిమా పేరుసమ్మతమే
దర్శకుడుగోపీనాథ్ రెడ్డి
నటీనటులు కిరణ్ అబ్బవరం, మరియు చాందిని చౌదరి
నిర్మాతలుకంకణాల ప్రవీణ
సంగీతంశేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీసతీష్ రెడ్డి మాసం
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

సమ్మతమే సినిమా ఎలా ఉందంటే?

సమ్మతమే మేకర్స్ చెప్పినట్లుగా, తాము ప్రత్యేకమైన కథను చెబుతున్నాము అని అయితే ఇది సాధారణ ప్రేమకథ అని సినిమా ప్రారంభం అయినా 10 నిమిషాల్లోనే మీకు అర్థమైపోతుంది.

మొదటి సగం కొన్ని వినోదాత్మక సన్నివేశాలు మరియు వారి ప్రేమతో ముగుస్తుంది మరియు తరువాత భాగం భావోద్వేగాలకు దారితీస్తుంది, అయితే భావోద్వేగాలను డీల్ చేస్తున్నప్పుడు మీరు ఏదో మిస్ అయినట్లు అనిపించవచ్చు మరియు క్లైమాక్స్‌ గురించి కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా తెరపై చక్కగా చిత్రీకరించారు.

సంబంధాల యొక్క ప్రత్యేకమైన దృక్కోణాన్ని ప్రస్తావించడం ప్రశంసించవలసిన విషయం, కానీ దర్శకుడు పాయింట్‌ను తెలియజేయడానికి కొన్ని బలమైన సన్నివేశాలను రాస్తే ఇంకా బాగుండేది .

కృష్ణగా కిరణ్ అబ్బవరం పర్లేదు , మధ్యతరగతి పాత్రలు తనకు కొత్త కావు, కృష్ణ పాత్ర అతనికి అంత ఛాలెంజింగ్‌గా అనిపించదు, సాన్వి పాత్రలో చాందిని ఓకే, ఆమె పాత్ర కూడా మనకు అంత స్ట్రాంగ్ గా అనిపించదు. మరియు మిగిలిన పాత్రలు తమ వంతు బాగా చేసారు.

గోపీనాథ్ రెడ్డి గారి పాయింట్ బాగుంది మరియు అతను తన రచనతో మిమ్మల్ని అక్కడక్కడా ఎంగేజ్ చేసాడని చెప్పొచ్చు అయితే మరియు రచన ఇంకా బాగుండాల్సింది.

టెక్నికల్ గా సమ్మతమే చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు మరియు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే, శేఖర్ చంద్ర సంగీతం బావుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమా మూడ్ ని పెంచాడు .

చివరగా, కుటుంబ చిత్రాలు మరియు రొమాంటిక్ చిత్రాలను ఇష్టపడితే సమ్మతమే ఒకసారి చూడొచ్చు

సినిమా రేటింగ్: 3/5

ఇవి కూడా చుడండి:

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు