Liger Telugu Movie Review: లైగర్‌ తెలుగు మూవీ రివ్యూ

Liger Telugu Movie Review: లైగర్’ అనే చిత్రంతో విజయ్ దేవరకొండ ఈరోజు మనముందుకొచ్చాడు, ఈ చిత్రం ప్రకటించినప్పటి నుండి చాలా క్యూరియాసిటీని సృష్టించింది మరియు విజయ్ దేవరకోయిండా యొక్క మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం, దానికి తోడు మేకర్స్ ట్రైలర్ విడుదల చేసాక క్యూరియాసిటీ రెట్టింపైంది.

Liger Telugu Movie Review

ఏది ఏమైనప్పటికీ, మేకర్స్ ఈ చిత్రాన్ని భారతదేశం అంతటా బాగా ప్రమోట్ చేసారు మరియు విజయ్ దేవరకొండ ప్రచార కార్యక్రమాలలో ఎలా పాల్గొంటాడో మనందరికీ తెలిసిన విషయమే అయినప్పటికీ, భారీ అంచనాలతో ఈ చిత్రం ఈరోజు ఆగష్టు 25, 2022 న విడుదలైంది ఇక ఆలస్యం చేయకుండా లోతైన సమీక్షలోకి వెళ్లి, సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉందా లేదా అని చూద్దాం.

కథ

బాలామణి (రమ్య కృష్ణ) మరియు ఆమె కుమారుడు లైగర్ (విజయ్ దేవరకొండ) కరీంనగర్‌కు చెందినవారు అయితే బతకడం కోసం ముంబై అనే నగరం వచ్చి అక్కడ ఇద్దరూ మనుగడ కోసం ‘చాయ్’ వ్యాపారం ప్రారంభిస్తారు, అయితే బాలామణి తన కొడుకు బాక్సింగ్ ఛాంపియన్‌ అవ్వాలని నిర్ణయించుకుంటుంది, కానీ బాక్సింగ్ కి చాల డబ్బు అవసరం పడుతుంది ఇక్కడే బాలమని లైగర్ తండ్రి గురించి ఒక నిజాన్ని బైటపెడుతుంది ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది, చివరికి లైగర్ ఫాదర్ ఎవరు? బాలామణి వెనుక కథ ఏమిటి? లిగర్ బాక్సర్ అవుతాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

లైగర్ మూవీ నటీనటులు

విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన తారాగణంగా నటించగా, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పూరీ జగన్నాధ్ రచన, దర్శకత్వం వహించగా, సినిమాటోగ్రఫీ అందించింది. విష్ణు శర్మ, సంగీతాన్ని అజీమ్ దయాని, ఈ చిత్రానికి జునైద్ సిద్ధిఖీ ఎడిటర్ మరియు పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా మరియు హిరూ యష్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సినిమా పేరులైగర్
దర్శకుడుపూరీ జగన్నాధ్
నటీనటులువిజయ్ దేవరకొండ,అనన్య పాండే,రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
నిర్మాతలుపూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా మరియు హిరూ యష్ జోహార్
సంగీతంఅజీమ్ దయాని
సినిమాటోగ్రఫీవిష్ణు శర్మ
ఓటీటీ రిలీజ్ డేట్ధ్రువీకరించలేదు
ఓటీటీ ప్లాట్ ఫార్మ్ధ్రువీకరించలేదు

లైగర్ సినిమా ఎలా ఉందంటే?

తెలుగులో బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి, అయితే శ్రీహరి యొక్క భద్రాచలం, పవన్ కళ్యాణ్ యొక్క తమ్ముడు వంటి అద్భుతమైన చిత్రాలు కూడా ఉన్నాయి, అయితే, చాలా గ్యాప్ తర్వాత డాషింగ్ ఫిల్మ్ మేకర్ పూరి జగన్నాధ్ ఈ థీమ్‌తో ముందుకు వచ్చారు, అలాగే కథ రెగ్యులర్ పూరి జగన్నాధ్ హీరోగా ప్రారంభమవుతుంది, ఒక యాక్షన్ సీక్వెన్స్, తరువాత కథ ముంబైకి మారుతుంది, అక్కడ బాలమణి మరియు లైగర్ మధ్య కొంత డ్రామాను చూస్తాము, కాని కొంత సమయం తర్వాత ఆ డ్రామాతో విసుగు చెందుతాము పూరి జగన్నాధ్ తన హీరో క్యారెక్టరైజేషన్ మరియు ఆలోచింపజేసే డైలాగ్‌లకు పేరుగాంచాడు. లైగర్‌లో చాలా ఉన్నాయి కానీ పాన్ ఇండియా చిత్రానికి అవి సరిపోవు.

ఫస్ట్ హాఫ్ అంతా బాగానే సాగింది కానీ అంతగా ఎంగేజింగ్ గ అయితే లేదు , ఎందుకంటే పూరి జగన్నాథ్ ఫస్ట్ హాఫ్‌లో డ్రామా మరియు లవ్ స్టోరీ అంతా సాగదీసినట్లు అనిపిస్తుంది, తద్వారా సెకండ్ హాఫ్ మొత్తాన్ని బాక్సింగ్ సీక్వెన్స్‌లు మరియు మైక్ టైసన్ సీన్‌తో ఫోకస్ చేయగలడు కానీ అది మిస్ ఫైర్ అయినట్లు అనిపిస్తుంది. కోర్ ఎమోషన్ ఫస్ట్ హాఫ్‌లో బాగా పండకపోవడం వల్ల అది సెకండ్ హాఫ్‌ని కూడా ప్రభావితం చేసింది, అయితే, మొదటి సగం కొన్ని సన్నివేశాలను కత్తిరించినట్లయితే అది వర్కవుట్ అయ్యేదేమో .

లైగర్‌గా విజయ్ చాలా సన్నివేశాల్లో నత్తి తో చాల బాగా చేసాడు, అయితే కొన్ని కోర్ ఎమోషన్స్‌ని ప్రదర్శించడంలో విఫలమయ్యాడు, అయితే బాక్సర్‌గా కనిపించేలా అతని మేక్ ఓవర్ మనం అభినందించాలి, అనన్య పాండేకి నటనకు స్కోప్ లేదు, బాలమణిగా రమ్యకృష్ణ చాలా అద్భుతంగా చేసింది, ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా కుదిరాయి, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను తమ పాత్రల మేరకు బాగా చేసారు.

పూరి జగన్నాధ్ తన టేకింగ్, హీరో క్యారెక్టరైజేషన్ మరియు డైలాగ్స్‌కి పేరు గాంచాడు, ఈ సినిమాలో పూరి మార్క్ చూడవచ్చు కానీ అతని పాత సినిమాల మాదిరిగా అయితే ఉండదు , ఈసారి అతను హీరో కంటే కథపై ఎక్కువగా దృష్టి పెట్టాడు, అయినప్పటికీ, అతను ప్రేక్షకులను కట్టిపడేయడంలో సక్సెస్ అయ్యాడని
చెప్పొచ్చు.

సాంకేతికంగా లైగర్‌ అద్భుతంగా ఉంది ,ప్రతి ఫ్రేమ్‌లో నిర్మాణ విలువలు రిచ్ గా కనిపిస్తాయి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది మరియు సినిమా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను బాలీవుడ్‌కు చెందిన విభిన్న సంగీత దర్శకులు చేసారు మరియు అజీమ్ దయాని పర్యవేక్షించారు, పాటలు అంత గొప్పగా లేవు , బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది మరియు మిగిలిన సాంకేతిక విభాగాలు తమ వంతు కృషి చేసారు.

చివరగా, లైగర్‌ అన్ని వర్గాల ప్రేక్షకులు వీక్షించగలిగే ఒక ఆకర్షణీయమైన బాక్సింగ్ డ్రామా, మరియు విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది విజువల్ ఫీస్ట్.

సినిమా రేటింగ్: 2.5/5

ఇవి కూడా చుడండి:

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు