Michael Box Office Collections: మైఖేల్ బాక్సాఫిస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్

Michael Movie Box Office Collections:సందీప్ కిషన్ వరుస పరాజయాలతో తన కెరీర్లో కొంచెం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. దాదాపు ఒక సంవత్సరం విరామం తర్వాత, తన కొత్త పాన్-ఇండియన్ చిత్రం ‘మైఖేల్’ నిన్న థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు ప్రతి భాషలో సినిమాని బాగా ప్రమోట్ చేసిన చిత్ర బృందం మొదటి రోజు ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, మైఖేల్ చిత్రం మొదటి రోజు దాదాపు 11 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Michael Box Office Collections

మైఖేల్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ డే వైజ్ (Michael Movie Box Office Collections world wide day wise)

డే వైజ్ఇండియా షేర్ కలెక్షన్స్
డే 1రూ. 5.23 కోట్లు
డే 2
డే 3
డే 4
డే 5
డే 6
డే 7
మొత్తం కలెక్షన్స్రూ. 5.23 కోట్లు

మైఖేల్ తారాగణం & సాంకేతిక నిపుణులు

మైఖేల్ చిత్రంలో, సందీప్ కిషన్ ప్రధాన పాత్రను పోషిస్తుండగా, దివ్యాంశ కౌశిక్ అతనికి జోడిగా నటించింది . విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు అనసూయ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.

మైఖేల్ చిత్రానికి రంజిత్ జయకోడి దర్శకత్వం వహించగా, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి మరియు శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌లపై భరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించారు. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించగా, కిరణ్ కౌశిక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఆర్.సత్యనారాయణన్ ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

సినిమా పేరుమైఖేల్
దర్శకుడురంజిత్ జయకోడి
నటీనటులుసందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు అనసూయ
నిర్మాతలుభరత్ చౌదరి & పుస్కుర్ రామ్ మోహన్ రావు
సంగీతంసామ్ సిఎస్
సినిమాటోగ్రఫీకిరణ్ కౌశిక్

మైఖేల్ ప్రీ రిలీజ్ బిజినెస్(Michael Pre Release Business)

మైఖేల్ సినిమా తెలుగు, తమిళం మరియు ఇతర భాషలలో సందీప్ కిషన్ మార్కెట్‌కు మించి చాలా ఎక్కువ బడ్జెట్‌తో నిర్మించబడింది. ట్రేడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. మైఖేల్ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 38 కోట్లకు చేరుకుంది. ఈ సినిమాని హిట్‌గా పరిగణించాలంటే టోటల్ థియేట్రికల్ రన్‌లో 40 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంది. ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటాలని, అలాగే హీరో సుందీప్ కిషన్ ఖాతాలో ఒక మంచి పడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

ఇవి కూడా చుడండి:

 

Similar Articles

Comments

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు